Pawan Kalyan: అంధుల క్రికెట్ ప్రపంచ విజేతలు కన్నీళ్లు తుడిచిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రుల క్రికెట్లో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన మహిళ జట్టు సభ్యురాల వేదనకు చలించి పోయారు. జట్టు సభ్యులు ఆర్థిక పరిస్థితి తెలసుకొని వారికి అండగా నిలిచారు. ఎవరు కష్టంతో తన దగ్గరకు వచ్చినా వారి సమస్యను హృదయపూర్వకంగా విని వెంటనే పరిష్కారం చూపించడమే తన విధానమని ఈ సంఘటనతో మరోసారి ఆయన నిరూపించారు.

ఇటీవలే ప్రపంచ కప్ గెలిచిన ఆంధ్ర మహిళా క్రికెటర్ జట్టు సభ్యురాలు దీపిక.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక తాను ఎదుర్కొన్న కష్టాలు, తన పరిస్థితులు ఆయన మనసును కదిలించాయి.. మ్యాచ్ ఫీజుతోనే తన కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో సత్యసాయి జిల్లాకు చెందిన కెప్టెన్ దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణకుమారి కుటుంబాల దయస్థితిని పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. అనంతరం వారికి తక్షణ సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారికి అండగా ఉంటానని ఆయ మాట ఇచ్చారు.
అయితే ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లోనే ప్రపంచ కప్ విజేతల కుటుంబాలకు టీవీ , టేబుల్ ఫ్యాన్ , మిక్సర్ గ్రైండర్ , ప్రెజర్ కుక్కర్ , స్టీల్ ప్లేట్లు , కుర్చీలు , చాపలు , ఇస్త్రీ పెట్టె , ఎల్ఈడి బల్బులు , పాత్రలు, దుప్పట్లు , దిండ్లు , నిత్యవసర సరుకులు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు అందేలా ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర క్రికెటర్ ఇళ్లలో వెలిగిన ఈ వస్తు కాంతులు వారి కుటుంబాల్లో కొత్త ఆశలను నింపాయి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంత త్వరగా స్పందిస్తారని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు..
ఇదే కాదు క్రికెట్ జట్టు సభ్యులు కలిసిన సమయంలో తమ గ్రామానికి వెళ్లే రెండు రహదారులు దుర్భందంగా ఉన్నాయని దీపిక ఆవేదన వ్యక్తం చేయగా పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు.. మధ్యాహ్నం ఆమె చెప్పిన సమస్యకు సాయంత్రానికే పరిష్కారం చూపారు. తంబాలహట్టి తండా నుంచి హైమావతి కి వెళ్లే రహదారికి 3.2 కోట్ల రూపాయలు.. గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల రూపాయల అంచనాతో మొత్తం ఆరు పాయింట్ రెండు కోట్ల విలువైన రెండు రోడ్లకు అనుమతులను మంజూరు చేశారు.
అంతటితో ఆగకుండా ఇద్దరు ఆంధ్ర క్రికెటర్లకు క్రీడాకారుల కోట కింద నూతన గృహాలు నిర్మించి ఇవ్వాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత డైనింగ్ టేబుల్ మంచాలు వంటివి అదనపు గృహ ఉపకరణాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




