Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Largest Metro: మెట్రో రంగంలో ప్రపంచానికి పోటీనిస్తున్న భారత్.. వెయ్యి కిలోమీటర్లతో సరికొత్త రికార్డు

భారతదేశంలో ప్రజా రవాణా రంగం వేగంగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా మెట్రో రైళ్లలో ప్రయాణిచడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మెట్రో రంగం వృద్ధితో ప్రపంచ దేశాలకు పోటీనిస్తుంది. ఈ భారతదేశంలో మెట్రో రంగం వృద్ధి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Largest Metro: మెట్రో రంగంలో ప్రపంచానికి పోటీనిస్తున్న భారత్.. వెయ్యి కిలోమీటర్లతో సరికొత్త రికార్డు
Metro 123
Follow us
Srinu

|

Updated on: Feb 03, 2025 | 7:29 PM

ప్రస్తతం దేశంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలోని మూడో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచిందని చెప్పారు. దేశంలో మెట్రో లైన్స్ 1,000 కి.మీలకు పైగా విస్తరించి ఉన్నాయని, అందువల్ల దేశంలో పట్టణ రవాణా మార్గంక్రమబద్ధీకరణ అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, పూణె, థానే, బెంగళూరులలో మెట్రో ప్రాజెక్టులతో పాటు అహ్మదాబాద్-భుజ్ మార్గంలో ఇటీవల ప్రారంభించిన నమో భారత్ ర్యాపిడ్ రైల్ నగరాల్లో ప్రజారవాణాను సులభతరం చేస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భారతదేశంలో ప్రస్తుతం పాటిస్తున్న వికసిత్ భారత్ లక్ష్యాల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయని 

ప్రభుత్వం పట్టణ సౌకర్యాలను ఆధునికీకరించడంతో పాటు వాటిని ఇంధన-సమర్థవంతంగా మార్చడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా నగరాల అభివృద్ధి అనేది మెట్రో అభివృద్ధిపై ఆధారపడి ఉందని తెలిపారు. భారతదేశం ఇప్పుడు మెట్రో నెట్‌వర్క్ పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా అవతరించిం పేర్కొన్నారు.  కొద్ది వారాల క్రితమే ఢిల్లీలోని రిథాలా-నరేలా-కుండ్లి కారిడార్‌పై పనులు ప్రారంభమయ్యాయని, ఇది ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌లోని ప్రధాన విభాగాలలో ఒకటిగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల కారణంగా ఢిల్లీలో మెట్రో మార్గాలు వేగంగా విస్తరిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

2014లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మొత్తం మెట్రో నెట్‌వర్క్ 200 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు అది రెండింతలు పెరిగిందని ముర్ము తెలిపారు. కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు పట్టణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 15 రోప్‌వే ప్రాజెక్టుల పనులు కూడా జరుగుతున్నాయని రాష్ట్రపతి చెప్పారు. అదనంగా రూ. 8,000 కోట్ల అంచనా వ్యయంతో దేశంలో 52,000 ఎలక్ట్రిక్ బస్సులను లాంచ్ చేయాలనే నిర్ణయం వల్ల పట్టణ రవాణాను వేగవంతం అవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి