Cyber Fraud: క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని ఫోన్‌ కాల్‌.. క్షణాల్లోనే అకౌంట్‌ ఖాళీ.. మీరు ట్రాప్‌లో పడొద్దంటే ఏం చేయాలి?

Cyber Fraud: ఈ రోజుల్లో సైబర్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా.. నేరగాళ్లు రకరకాల మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని ఓ బాధితుడికి ఫోన్‌ చేసిన నేరగాడు.. క్షణాల్లోనే లక్షలాది రూపాయలు చోరీ చేశాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా..

Cyber Fraud: క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని ఫోన్‌ కాల్‌.. క్షణాల్లోనే అకౌంట్‌ ఖాళీ.. మీరు ట్రాప్‌లో పడొద్దంటే ఏం చేయాలి?
Follow us
Vijay Saatha

| Edited By: Subhash Goud

Updated on: Nov 12, 2024 | 4:51 PM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేరుతో ఒక బాధితుడికి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచేందుకు సంబంధిత వివరాలు, కార్డు నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడిగాడు. అనంతరం బాధితుడికి వాట్సాప్ ద్వారా ఒక APK ఫైల్ పంపించారు. బాధితుడు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే, అతని మొబైల్ ఫోన్ మాల్వేర్ ద్వారా హ్యాక్ చేయబడింది. ఫలితంగా, బాధితుడు ఎటువంటి ఓటీపీని అందించకపోయినా, అతని హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నుండి రూ.2,91,726 మొత్తం మూడు వేర్వేరు లావాదేవీల ద్వారా డెబిట్ అయ్యాయి.

బాధితుడు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ యూనిట్, హైదరాబాద్ NCRP టీమ్ ఈ ఘటనపై చర్యలు తీసుకొని బాధితుడి మొబైల్ ఫోన్ నుండి మాల్వేర్‌ను తొలగించారు. లావాదేవీలు యామజాన్ ద్వారా జరిగినట్లు గుర్తించారు. బాధితుడు నవంబర్ 2, 2024న ఆన్‌లైన్‌లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసాడు. సంబంధిత అధికారులకు నోటీసులు పంపించి, నిధులను బ్లాక్ చేయించారు.

NCRP టీమ్ తీసుకున్న తక్షణ చర్యలతో కోర్టు ఆదేశం లేకుండానే రూ.2,91,726 మొత్తం‌ను వ్యాపారి బాధితుడి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కు తిరిగి చెల్లించాడు. ఈ సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ NCRP టీమ్‌ను అభినందించారు.

  • వాట్సాప్ లేదా ఇతర మెసేజ్‌ల ద్వారా పంపే ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయకండి. ఈ ఫైళ్ల ద్వారా ఫ్రాడ్‌స్టర్లు మీ పర్సనల్ డేటాను చోరి చేయవచ్చు.
  • మీ KYC డాక్యుమెంట్లు అప్‌డేట్ చేయాలి లేదా వెరిఫై చేయాలి అని చెప్పే ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించవద్దు.
  • యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, డెబిట్ కార్డ్ నంబర్, పిన్, CVV, OTP వంటి వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.
  • పై వివరాలను మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కూడా పంచుకోవద్దు.
  • మీకు సంబంధించి నిజమైన సందేహాలు ఉంటే, మీ బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థను ప్రత్యక్షంగా సందర్శించడం మంచిది.
  • సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే ఫిర్యాదు చేస్తే, మీ డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Donkey- Camel Milk: గాడిద – ఒంటె పాలలో ఏది ఖరీదైనది.. వీటిలో ఔషధ గుణాలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..