IT CEOs Salaries: దిగ్గజ ఐటీ కంపెనీల్లో వేతన అసమానతలు! గత పదేళ్లో 835 శాతం పెరిగిన సీఈఓల వేతనాలు.. ఫ్రెషర్లకు 45 శాతం మాత్రమే!

గడచిన దశాబ్ధ కాలంలో దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక చెల్లింపులు గణనీయంగా 835 శాతం పెరిగాయి. ఆయా కంపెనీల్లో చేరే ఫ్రెషర్ల జీతాలు మాత్రం అందుకు భిన్నంగా..

IT CEOs Salaries: దిగ్గజ ఐటీ కంపెనీల్లో వేతన అసమానతలు! గత పదేళ్లో 835 శాతం పెరిగిన సీఈఓల వేతనాలు.. ఫ్రెషర్లకు 45 శాతం మాత్రమే!
It Ceo
Follow us
Srilakshmi C

|

Updated on: May 31, 2022 | 8:23 PM

CEO paycheques in India’s largest IT companies: గడచిన దశాబ్ధ కాలంలో దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో పనిచేసే సీఈవోల వార్షిక చెల్లింపులు గణనీయంగా 835 శాతం పెరిగాయి. ఆయా కంపెనీల్లో చేరే ఫ్రెషర్ల జీతాలు మాత్రం అందుకు భిన్నంగా కేవలం 45 శాతం మాత్రమే పెరిగాయి. ఉదాహరణకు 2012లో ఇన్ఫోసిస్‌ సీఈవో వార్షిక వేతనం రూ.80 కోట్లుండగా.. అది 2022 నాటికి రూ.79.75 కోట్లకు పెరిగింది. ఫ్రెషర్ల వార్షిక వేతనం రూ.2.75 లక్షల నుంచి 3.6 లక్షలకు మాత్రమే పెరిగింది.

టీమ్‌లీజ్ డిజిటల్ డేటా ప్రకారం.. సీఈవో – ఫ్రెషర్ మధ్య వేతనాల నిర్దిష్ట నిష్పత్తి.. ఇన్ఫోసిస్‌కు 1973, విప్రోకి 2111, హెసీఎల్‌ టెక్నాలజీస్‌కు 1020, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌కి 676, టెక్ మహీంద్రాకి 644, టీసీఎస్‌కి 619 మేర ఉంది. ఐటీ ఇండస్ట్రీలోని టాప్‌ కంపెనీల్లో నేడు వేతన అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ కింది నివేదిక తెల్పుతోందని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫినాన్షియల్‌ ఆఫీసర్‌ మోహన్‌ దాస్ పై తెలిపారు. చూడబోతే భారతీయ కార్పొరేట్ సంస్కృతి అమెరికన్లను అనుసరిస్తున్నట్లుందని ఆయన అన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఐటీ ఫ్రెషర్ల వేతనాల్లో పెరుగుదల చాలా తక్కువగా ఉంది. గత 10 సంవత్సరాల్లో డబ్బు విలువ సగానికి పడిపోయిందని మీరు గమనించే ఉంటారు. ఆ విధంగా చూస్తే ఈ రోజు రూ. 4 లక్షల జీతం దశాబ్దం క్రితం రూ. 2 లక్షలతో సమానం అవుతుందని చెప్పాలి.

Ceo Paycheques

Ceo Paycheques

డిమాండ్ తక్కువ.. సప్లై ఎక్కువ..

ఇవి కూడా చదవండి

ప్రతీయేట పెరుగుతున్న ఇంజనీర్ల కారణంగా ఐటీ ఫ్రెషర్‌ల జీతాలు పెరగట్లేదని అంటున్నారు. మన దేశంలో ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటికి వస్తున్నారు. IT రంగంలో డిమాండ్ కంటే ఫ్రెషర్ల సరఫరా నాలుగు రెట్లు అధికంగా ఉందని, వీరందరికీ జీతాలు ఎక్కువగా చెల్లించవల్సిన అవసరం ఏముందని అంటున్నారు. FY22లో మొత్తం 3,60,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి. మూడు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న ఇంజనీర్లకు జీతాలు ప్రస్తుతం 60 శాతం పెరిగాయి.

మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. వేతన వ్యత్యాసాలు కేవలం ఫ్రెషర్‌ల స్థాయిలోనే ఉండకపోవచ్చని మనీకంట్రోల్ నివేదించింది. సీఈవోలకు, ఫ్రెషర్లకు మధ్య వేతనం సుదీర్ఘకాలంలో ఐటీ రంగాన్ని తీవ్ర దెబ్బతీస్తుందని తెల్పింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.