DRDO-ARDE Recruitment 2022: బీటెక్/ఎంటెక్‌ అర్హతతో.. ఆర్నమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పూణెలోని డీఆర్డీఓ - ఆర్నమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ARDE).. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (Junior Research Fellow Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

DRDO-ARDE Recruitment 2022: బీటెక్/ఎంటెక్‌ అర్హతతో.. ఆర్నమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉద్యోగాలు..
Drdo
Follow us
Srilakshmi C

|

Updated on: May 30, 2022 | 9:23 PM

DRDO-ARDE Junior Research Fellow Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన పూణెలోని డీఆర్డీఓ – ఆర్నమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ARDE).. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (Junior Research Fellow Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

స్టైఫండ్: నెలకు రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ ఎంఈ/ ఎంటెక్‌లోఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/గేట్‌లో అర్హత కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ది డైరెక్టర్, ఆర్నమెంట్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, పశాన్‌, పుణె-411021.

దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.