AP Inter Board: కనుమరుగుకానున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు! త్వరలో పాఠశాల విద్యలో విలీనంకానున్న ఇంటర్‌..

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖలో త్వరలో ఇంటర్మీడియట్‌ విలీనం కానుంది. అందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు త్వరలోనే..

AP Inter Board: కనుమరుగుకానున్న ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు! త్వరలో పాఠశాల విద్యలో విలీనంకానున్న ఇంటర్‌..
Ap Inter Board
Follow us

|

Updated on: May 30, 2022 | 4:51 PM

Andhra Pradesh Board of Education: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖలో త్వరలో ఇంటర్మీడియట్‌ విలీనం కానుంది. అందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు కనుమరుగయ్యే పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగంలోనే రెండు శాఖల అధికారులుంటారు. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 5+3+3+4లో చివరి నాలుగేళ్లు 9, 10, 11, 12 తరగతులు ఉంటాయి. వీటికి సంబంధించి కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రత్యేకంగా అమలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఎన్‌ఈపీ అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం ప్రవేశపెట్టడం, ఉన్నత పాఠశాలల్లో ప్లస్‌టూను ఎలాగూ ప్రారంభిస్తున్నందున ఈ విలీనానికి నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు సాగుతోంది. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల నియామకాలు, సర్వీసు నిబంధనలు, కొత్తగా ఏ విభాగాలు ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పదోన్నతుల్లో, సర్వీసు నిబంధనల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇంటర్మీడియట్‌లోని విద్యా పరిశోధన, శిక్షణ మండలిని పాఠశాల విద్యలోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలిలో (NCERT) విలీనం చేస్తారు. ఇంటర్‌ వృత్తి విద్యా కోర్సులను సమగ్రశిక్ష అభియాన్‌లో నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల్లో కలిపేస్తారు. పాఠశాల విద్య, ఇంటర్‌ విద్యకు కలిపి కొత్తగా డైరెక్టర్‌ అకడమిక్‌, డైరెక్టర్‌ పరిపాలన, డైరెక్టర్‌ అకౌంట్స్‌ విభాగాలను ఏర్పాటు చేస్తారు. వీటి కిందికి 2 శాఖల్లోని వారిని తీసుకొస్తారు. ప్రస్తుతం పాఠశాల విద్యలో 4 ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్జేడీ) పోస్టులుండగా.. ఇంటర్‌లో మూడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కొత్తగా ఇంటర్‌ ఆర్జేడీ పోస్టును ఏర్పాటు చేస్తారు. ఇద్దరు ఆర్జేడీలు ఉంటే 9నుంచి 12వ తరగతి వరకు ఒకరు పర్యవేక్షిస్తారు. ఇంటర్‌ విద్యా మండలిలోని సిబ్బందిని ప్రభుత్వ పరీక్షల విభాగంలో విలీనం చేస్తారు. పది, ఇంటర్మీడియట్‌కు ఈ బోర్డే పరీక్షలు నిర్వహిస్తుంది.

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 434 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 292 కళాశాలలను ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసి ‘హైస్కూల్‌ ప్లస్‌’గా పిలుస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్లకు అవకాశమిస్తారు. జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్‌ పోస్టును జోనల్‌ పోస్టుగా మార్పు చేయనున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో అర్హత కలిగిన ఉపాధ్యాయులను పదోన్నతుల ద్వారా లెక్చరర్లుగా నియమించాలని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న జూనియర్‌ కళాశాలల్లో 90శాతం నేరుగా నియామకాలు, 10శాతం బోధనేతర సిబ్బందిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. హైస్కూల్‌ ప్లస్‌లో ప్రాథమికంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్మీడియట్‌కు జిల్లాలో ఆర్‌ఐఓ, డీవీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు ఉండగా, కొత్త జిల్లాలు ఏర్పడినందున జిల్లాకు ఒక డీవీఈఓ పోస్టును మాత్రమే ఉంచుతారు. క్షేత్రస్థాయిలో హైస్కూల్‌ ప్లస్‌ను ఎవరు పర్యవేక్షించాలనే అంశంపై నిర్ణయానికి రాలేదు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.