TSPSC Group-1 Jobs 2022: రేపటితో ముగుస్తున్న టీఎస్సీపీఎస్సీ గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ.. 3లక్షలకు చేరువలో..

తెలంగాణ గ్రూప్‌1 దరఖాస్తు ప్రక్రియ రేపటి (మే 31)తో ముగియనుంది. మొత్తం 503 పోస్టులకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నవారు..

TSPSC Group-1 Jobs 2022: రేపటితో ముగుస్తున్న టీఎస్సీపీఎస్సీ గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ.. 3లక్షలకు చేరువలో..
Tspsc
Follow us
Srilakshmi C

|

Updated on: May 30, 2022 | 4:17 PM

TSPSC Group 1 Application Last Date 2022: తెలంగాణ గ్రూప్‌1 దరఖాస్తు ప్రక్రియ రేపటి (మే 31)తో ముగియనుంది. మొత్తం 503 పోస్టులకు ఇప్పటివరకు 2 లక్షల 62 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రేపు గడువు సమయం ముగిసేనాటికి దరఖాస్తుల సంఖ్య 3 లక్షలకు చేరుకునే అవకాశాలున్నాయని టీఎస్‌పీఎస్సీ (TSPSC) వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా మే 2 నుంచి గ్రూప్‌-1 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రోజుకు సగటున 10 వేల చొప్పున దరఖాస్తులు వస్తున్నట్లు కమిషన్‌ వర్గాలు తెలిపాయి. గడువు సమీపిస్తుండటంతో రోజువారీ దరఖాస్తుల సంఖ్య 15 వేలకు పైగా ఉంటున్నట్లు పేర్కొంది. గ్రూప్‌-1 యూనిఫాం (Group 1 Jobs) పోస్టులైన డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్‌ పోస్టుల గరిష్ఠ వయోపరిమితి, శారీరక దారుఢ్య పరీక్షల అర్హతల్లో ప్రభుత్వం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థుల డిమాండ్‌ మేరకు అర్హతలను ఖరారు చేసింది.

అరకొరగానే ఓటీఆర్‌ సవరణలు.. 

రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల సంఖ్య పెరిగింది. స్థానికత నిర్వచనం, స్థానిక కోటాలో మార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ వద్ద వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (OTR)లో నమోదైన ఉద్యోగార్థులు నూతన ఉత్తర్వుల ప్రకారం సవరణ చేసుకోవాలని కమిషన్‌ సూచించింది. రెండు నెలల క్రితం ఈ మేరకు ఆప్షన్‌ ఇచ్చింది. గతంలో ఓటీఆర్‌లు నమోదు చేసుకున్న 25 లక్షల మందిలో కేవలం 3,27,720 మంది మాత్రమే నూతన ఉత్తర్వుల ప్రకారం వివరాలను సవరించుకున్నారు. మరో 1,59,304 మంది కొత్తగా ఓటీఆర్‌లు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ నాటికి..

నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌లో వివరాలు సవరించుకున్న, కొత్తగా నమోదు చేసుకున్నవారు మొత్తం 4,87,024 మంది ఉండగా.. వీరిలో 2,62,590 మంది గ్రూప్‌-1కు దరఖాస్తు చేశారు. గ్రూప్‌-4 ప్రకటన వెలువడితే భారీ సంఖ్యలో ఓటీఆర్‌ సవరణలతో పాటు దరఖాస్తులొచ్చే అవకాశముందని కమిషన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.