Dr K Laxman : బీజేపీ సంచలన నిర్ణయం.. యూపీ నుంచి డా.కె. లక్ష్మణ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు..
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ వెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ (Dr K Laxman)రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ వెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి లక్ష్మణ్‌ను రాజ్యసభకు బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన డాక్టర్ కె లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ నాయకత్వం అనూహ్యరీతిలో లక్ష్మణ్ ను రాజ్యసభకు పంపుతున్నది.
ఇక్కడ ప్రత్యర్థి టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళుతోన్న ముగ్గురిలో ఒకరు బీసీ అయినప్పటికీ వద్దిరాజు రవిచంద్ర శ్రీమంతుడు కావడం, బీజేపీ ఎంచుకున్న లక్ష్మణ్ మాత్రం సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తోన్న నేత కావడమనే తేడాను జనంలోకి తీసుకెళ్లాలనే కమలదళం ఇలాంటి ఎంపికను చేసినట్లు తెలుస్తోంది.
Filed my nomination for Rajya Sabha in august presence of CM of #UttarPradesh Sri @myogiadityanath Ji at Lucknow.
I want to thank PM Sri @narendramodi Ji, @BJP4India Nat’l President Sri @JPNadda Ji, Home Minister Sri @amitshah Ji & Org Sec Sri @blsanthosh Ji for nominating me. pic.twitter.com/jEc6bWXCe2
— Dr K Laxman (@drlaxmanbjp) May 31, 2022
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్థులైన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ నుంచి ముగ్గురూ ధనవంతులనే రాజ్యసభకు పంపడం, ఏపీ సీఎం జగన్ వైసీపీ నుంచి బీసీ నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపిన వైనానికి కౌంటర్ గానే లక్ష్మణ్ కు బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.