అమ్మానుషం.. భర్త కొట్టాడని ఆరుగురు పిల్లలను చంపిన తల్లి.. అందరినీ బావిలోకి నెట్టి..

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నాటికి మొత్తం ఆరు మృతదేహాలను బయటకు తీశారు.

అమ్మానుషం.. భర్త కొట్టాడని ఆరుగురు పిల్లలను చంపిన తల్లి.. అందరినీ బావిలోకి నెట్టి..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 31, 2022 | 3:13 PM

Maharashtra Woman Kills Her 6 Children: మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ తల్లి తన ఆరుగురు పిల్లలను ఒక్కొక్కరిగా బావిలోకి నెట్టి.. వారు చనిపోవడాన్ని చూస్తూ బయట కూర్చుంది. ఈ విషాద ఘటన రాయగడ జిల్లా మహద్ తాలూకా బోర్వాడి గ్రామంలో సోమవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నాటికి మొత్తం ఆరు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో ఐదుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం తన భర్త తనను తీవ్రంగా కొట్టాడని విచారణలో మహిళ చెప్పింది. దీంతో కోపోద్రిక్తురాలైన ఆ మహిళ రాత్రి వేళ తన పిల్లలను తీసుకొని బావి దగ్గరకు వెళ్లి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన పిల్లల వయసు 10 నుంచి 3 ఏళ్ల మధ్య ఉంటుంది. నిందితురాలు పేరు రునా చికురి సాహ్ని (30). మృతుల్లో రోష్ని (10), కరిష్మా (8), రేష్మ (6), విద్య (5), శివరాజ్ (3), రాధ (3) ఉన్నారు. పిల్లల చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి బావిలో దూకింది.

అయితే స్థానికులు ఆమెను రక్షించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మహద్‌ ఎమ్మెల్యే భరత్‌ గోగవాలే కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. కాగా.. మంగళవారం ఉదయం నాటికి అన్ని మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..