AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Student Dies: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. విహార యాత్రకు వెళ్లి మృత్యు ఒడిలోకి..

Telangana Student Dies: అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణ యువకుడు మృతి చెందడం విషాదంగా మారింది. ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆ యువకుడికి మృతి చెందడం..

Telangana Student Dies: అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. విహార యాత్రకు వెళ్లి మృత్యు ఒడిలోకి..
Subhash Goud
|

Updated on: May 31, 2022 | 3:15 PM

Share

Telangana Student Dies: అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణ యువకుడు మృతి చెందడం విషాదంగా మారింది. ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆ యువకుడికి మృతి చెందడం అతని కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. తెలంగాణలోని వేముల వాడకు చెందిన కంటె యశ్వంత్‌ (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలో విహార యాత్రకు వెళ్లి సముద్రంలో అలల తాకిడికి గురై మరణించాడు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. యశ్వంత్‌ వేములవాడ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంటె మల్లయ్య కుమారుడు. ఎమ్మెస్‌ చదివేందుకు 8 నెలల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. వారాంతపు రోజు కావడంతో ఈనెల 29న యశ్వంత్‌ స్నేహితులతో కలిసి ఐర్లాండ్‌లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేటు బోటు తీసుకుని పీటా దీవుల వద్దకు చేరుకున్నారు.

అలలతో ప్రాణాలకు ముప్పు

సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బోట్‌ స్టార్ట్‌ చేయగా, ఇంజిన్‌ ఆన్‌ కాలేదు. దీంతో అలలు భారీగా రావడంతో బోటు మూడు మీటర్ల లోతు నుంచి సుమారు 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకున్నట్లు యశ్వంత్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు. ప్రమాదం పొంచివుందని గమనించిన యశ్వంత్‌ నీటిలోకి దిగాడు. అలలు ఎక్కువగా కావడంతో బయటకు వచ్చేందుకు ఎంత ఈతకొట్టినా ఫలితం లేకపోయింది. లైఫ్‌ జాకెట్స్‌ ధరించి నీటిలోకి దిగి మూడు గంటల పాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. స్నేహితులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యశ్వంత్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. యశ్వంత్‌ మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి