AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: భారత్‌లో భారీగా పెరుగుతోన్న సైబర్‌ నేరాలు.. ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.?

Cyber Crime: రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల స్వభావం కూడా మారుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని బాధితుల ఖాతాల్లోని డబ్బును కొట్టేస్తున్నారు కేటుగాళ్లు...

Cyber Crime: భారత్‌లో భారీగా పెరుగుతోన్న సైబర్‌ నేరాలు.. ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందో తెలుసా.?
Narender Vaitla
|

Updated on: May 31, 2022 | 2:49 PM

Share

Cyber Crime: రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాల స్వభావం కూడా మారుతోంది. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని బాధితుల ఖాతాల్లోని డబ్బును కొట్టేస్తున్నారు కేటుగాళ్లు. ఇక టెక్నాలజీపై అవగాహన ఉన్న దేశాల్లోనే ఎక్కువగా ఈ సైబర్‌ నేరాలు జరుగుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) ప్రపంచంలో ఏ దేశాల్లో అధికంగా సైబర్‌ నేరాలు జరుగుతున్నాయన్న దానిపై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలోనే సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతోన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ 4వ స్థానంలో ఉంది. ఇంటర్నెట్‌ క్రైమ్‌ కంప్లయింట్ సెంటర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎఫ్‌బీఐ ఈ జాబితాను రూపొందించింది.

అంటే సైబర్‌ నేరాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ జాబితాను విడుదల చేశారు. 2021లో 3131 మంది సైబర్‌ నేరాల బారిన పడిన బాధితులతో 4వ స్థానంలో నిలిచింది. ఇక 4,66,501 మందితో అమెరికా మొదటి స్థానంలో, 3,03,949 మందితో యూకే రెండో స్థానంలో, 5788 మందితో కెనడా మూడో స్థానంలో నిలిచింది. 5వ స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న 20 దేశాల జాబితాను ఎఫ్‌బీఐ విడుదల చేసింది.

ఇక మన పొరుగు దేశాలైనా పాకిస్థాన్‌, చైనాలు సైబర్‌ క్రైమ్‌ బాధితుల్లో మనకంటే తక్కువే నమోదయ్యాయి. మిగిలిన అన్ని దేశాల్లో బాధితుల సంఖ్య 25 వేలు మాత్రమే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న సైబర్‌ క్రైమ్స్‌లో ఎక్కువగా ఫిషింగ్ తరహా మోసాలు జరుగుతున్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. రకరాల స్పామ్‌ మెసేజ్‌లు, మెయిల్స్‌తో కంప్యూటర్‌లను తమ ఆధీనంలోకి తీసుకొని యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగలిస్తూ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్