TSPSC Group 1 exam date 2022: నేటితో ముగుస్తున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ! చివరిరోజున పోటెత్తనున్న దరఖాస్తులు..
తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్1 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (మే 31)తో ముగుస్తుంది. మొత్తం 503 పోస్టులకు విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు (TSPSC Group 1 Notification 2022) ఇప్పటివరకు రికార్డు స్థాయిలో..
TSPSC Group 1 Application Last Date 2022: తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్1 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (మే 31)తో ముగుస్తుంది. మొత్తం 503 పోస్టులకు విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు (TSPSC Group 1 Notification 2022) ఇప్పటివరకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందినట్లు కమిషన్ తెల్పింది. నిన్న రాత్రి (మే 30) 10 గంటల నాటికి దాదాపు 2,94,644 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కరోజులోనే దాదాపు 32 వేల మంది అప్లికేషన్లు ఫిల్ చేసినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి. ఇక మే 31 చివరి తేదీ కావడంతో దరఖాస్తుల సంఖ్య 3 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు అంచనానెలకొంది.
గతంలో (2011)లో తెలంగాణ ప్రభుత్వం 312 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. ఏకంగా 3 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. పోస్టులు తక్కువగా ఉన్నప్పటికీ అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏ మాత్రం తగ్గట్లేదు. ఈ సారి వెడువడిన నోటిఫికేషన్‌లో కాస్త మెరుగ్గా 503 పోస్టులు ఉండటంతో దరఖాస్తు ప్రక్రియ ముగింపు సమయం నాటికి రికార్డు స్థాయిలో దరఖాస్తులు పోటెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 యూనిఫాం (Group 1 Jobs) పోస్టులైన డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్ పోస్టుల గరిష్ఠ వయోపరిమితి, శారీరక దారుఢ్య పరీక్షల అర్హతల్లో ప్రభుత్వం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. యూపీఎస్సీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థుల డిమాండ్ మేరకు అర్హతలను ఖరారు చేసింది. దీంతో చివరి నిముషం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున సర్వస్ డౌన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉన్నట్లు టీఎస్స్‌పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్‌లో తెలియజేసింది. ఐతే యూపీఎస్సీ సివిల్స్‌కు సమాన స్థాయిలో జరిగే గ్రూప్ 1 పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవసరమైన మెటీరియల్ ఇంకా మార్కెట్లోకి రాకపోవడంతో ప్రిపరేషన్‌కు మరికొంత సమయం ఇవ్వవలసిందిగా కమిషన్‌కు అభ్యర్ధుల నుంచి విజ్ఞాపనలు వస్తున్నాయి. మరోవైపు జులైలో బ్యాంకు, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, ఇతర పోటీ పరీక్షలు, ఆగస్టులో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తేదీలను కూడా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఒకటి కంటే అధిక పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని వాయిదా వేయాలని, ప్రిపరేషన్‌కు కనీసం 3 నెలల గడువు ఇవ్వవల్సిందిగా కోరుతున్నారు. విజ్ఞాపనలపై టీఎస్‌పీఎస్సీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.