AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌! జాబ్ పర్మినెంట్‌ వాయిదా..

జూన్ నెలాఖరు నాటికి పర్మినెంట్ చేస్తారని ఎదురుచూసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (ap grama ward sachivalayam Jobs) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చించింది. మొత్తం ఉద్యోగుల్లో ప్రస్తుతానికి..

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ షాక్‌! జాబ్ పర్మినెంట్‌ వాయిదా..
Ap Grama Sachivalayam
Srilakshmi C
|

Updated on: May 31, 2022 | 11:31 AM

Share

AP grama, ward sachivalayam employees: జూన్ నెలాఖరు నాటికి పర్మినెంట్ చేస్తారని ఎదురుచూసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు (ap grama ward sachivalayam Jobs) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ షాకిచ్చించింది. మొత్తం ఉద్యోగుల్లో ప్రస్తుతానికి 56,0000ల మందిని మాత్రమే పర్మినెంట్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో దాదాపు 60,000ల మందిని పర్మినెంట్ (job permanent) చేయకుండా పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగ భద్రతలేక సచివాలయ ఉద్యోగులు ఇరకాటంలో పడ్డట్లయ్యింది. కాగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,17,000ల మందికి ప్రభుత్వం రాత పరీక్షలు నిర్వహించి మరీ కొలువులు షురూ చేసింది. ఐతే ఉద్యోగాల్లో చేరిన వారిని అప్రెంటిషిపులుగా పేర్కొంటూ రూ.15,000ల జీతాలతో 2 సంవత్సరాలుగా పనిచేయించుకుంది. ఆ తర్వాత డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష పాసయితేనే పర్మినెంట్‌ చేస్తామనే షరతు పెట్టింది.

డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తారంటే.. నిజానికి ఎపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షలు ఉద్యోగులు ప్రమోషన్లు పొందడానికి నిర్వహిస్తారు. అంటే అప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా జాయిన్ అయినవారు.. ప్రమోషన్లు పొందడానికి ఈ పరీక్షకు హాజరవుతారు. కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో నెగ్గినవారికి పదోన్నతులు కల్పిస్తారన్నమాట. సాధారణంగా డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు అందుకు నిర్వహిస్తారు. దీనిని ఎప్పటినుంచో కమిషన్ అనుసరిస్తోంది కూడా. ఐతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంతో జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ప్రొబేషన్ ప్రకటించడానికి డిపార్ట్‌మెంటల్‌ టెస్టును నిర్వహించడమనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పైగా వాయిదాల పర్వంతో తమ ఉద్యోగాలు ఉంటాయో? లేదో?ననే సందిగ్ధంలో సచివాలయ ఉద్యోగుల్లో గుబులు పుడుతోంది

పరీక్షలు నిర్వహించినా ఇంకా ఫలితాలు విడుదలవ్వని వైనం.. 14,000ల మహిళా పోలీసులకు ఏడాది క్రితం డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాలు మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు. కొందరు ఉద్యోగులకు అసలు పరీక్షలే నిర్వహించలేదు. పైగా లీవ్‌లో ఉన్నవారికి ఉద్యోగం పర్మినెంట్ చేయబోమని ప్రకటించింది. ఇలా పలురకాలు కొర్రీలు పెట్టి ఉద్యోగుల పర్మినెంట్ వాయిదాలేస్తూ వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

లీవులు పెడితే అంతే సంగతులు! మహిళా ఉద్యోగులు మెటర్నిటీ లీవ్ తీసుకున్నా, ఇతర అనారోగ్యకారణాలతో విధులకు హజరవ్వకపోయినా.. అటువంటి వారినందరినీ పక్కన పెట్టేశారు. ఇలా ఫిల్టర్ చేయగా దాదాపు 60,000ల మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు పర్మినెంట్ చేయకుండా నోటీసులు జారీ చేశారు. తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్‌లు పెరగడంతో ప్రభుత్వం తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని పలువురు వాపోతున్నారు. అర్హత పరీక్షల్లో పాసైన తమకు డిపార్ట్‌మెంటల్ పరీక్ష గుదిబండలా మారిందని, రెగ్యులర్ చేయడానికి ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు.

ఏపీపీఎస్సీ పరీక్షలన్నింటికీ ‘కీ ‘విడుదల చేస్తున్నప్పటికీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లకు మాత్రం ఎందుకు కీ విడుదల చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలతో విసిగిన కొందరు రాజీనామా చేస్తే, అటువంటి వారు అప్రెంటిషిప్‌ కాలంలో తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించాలంటూ నిబంధనలు పెట్టారు. దీంతో సచివాలయ ఉద్యోగాలకు అసలెందుకు చేరామా? అని పలువురు ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల జగన్ సర్కార్ వింత వైఖరి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.