AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG 2022: నీట్‌ యూజీ 2022 ప్రవేశ పరీక్షకు18 లక్షలకు పైగా దరఖాస్తులు.. జులై 17న యథతథంగా..

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (NEET)-2022 కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 18 లక్షలు దాటింది. వీరిలో 10.64 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం..

NEET UG 2022: నీట్‌ యూజీ 2022 ప్రవేశ పరీక్షకు18 లక్షలకు పైగా దరఖాస్తులు.. జులై 17న యథతథంగా..
Neet 2022
Srilakshmi C
|

Updated on: May 30, 2022 | 5:17 PM

Share

NEET UG 2022 Exam Date: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (NEET)-2022 కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 18 లక్షలు దాటింది. వీరిలో 10.64 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం. 8.07 మంది పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా మొత్తం 18.72 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్‌ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జులై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 భాషల్లో ఎన్టీఏ నీట్‌ పరీక్షను నిర్వహించనుంది. ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 771 మంది విదేశీయులు, 910 మంది ప్రవాస భారతీయులు, 647 మంది ఓవర్‌సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా కార్డు హోల్డర్లు కూడా ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఇంగ్లిష్‌ను పరీక్ష మాధ్యమంగా ఎంచుకోగా.. తర్వాత హిందీ, తమిళం ఉన్నాయి. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష తేదీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్థులు డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే యథాతథంగా జులై 17న పరీక్ష జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది.

కాగా గత ఏడాది నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష సెప్టెంబర్‌ 12వ తేదీన జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం (15.44 లక్షలు) మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 3,858 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. దాదాపు 8.70 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్