TS EAMCET 2022: నేటి నుంచి తెరచుకోనున్న తెలంగాణ ఎంసెట్‌-2022 సవరణ విండో.. పరీక్ష తేదీలివే..

రిజిస్ట్రేషన్‌ సమయంలో, వివరాలను తప్పుగా నమోదు చేసుకునివుంటే, అటువంటివారికి మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తూ జేఎన్టీయూహెచ్‌ (జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ- హైదరాబాద్) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంసెట్ ఎడిట్‌ విండో..

TS EAMCET 2022: నేటి నుంచి తెరచుకోనున్న తెలంగాణ ఎంసెట్‌-2022 సవరణ విండో.. పరీక్ష తేదీలివే..
Ts Eamcet 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 30, 2022 | 3:35 PM

TS EAMCET 2022 Application correction window begin: తెలంగాణ ఎంసెట్‌ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మే 28తో ముగిసిన విషయం తెలిసిందే. ఆలస్య రుసుముతో జులై 7 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ సమయంలో, వివరాలను తప్పుగా నమోదు చేసుకునివుంటే, అటువంటివారికి మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తూ జేఎన్టీయూహెచ్‌ (జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ- హైదరాబాద్) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంసెట్ ఎడిట్‌ విండో (TS EAMCET 2022 correction window) నేటి (మే 30) నుంచి తెరచుకుంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ eamcet.tsche.ac.inలో జూన్‌ 6 వరకు సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ మేరకు సూచించింది. కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.250 ఆలస్య రుసుముతో జూన్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.5000 ఆలస్య రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తేదీలివే.. టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు జులై 14, 15 తేదీల్లో జరగనున్నాయి. ఇంజనీరింగ్ పరీక్షలు జూలై 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.