UGC NET Exam 2022: మరికొన్ని గంటల్లో ముగుస్తున్న యూసీజీ నెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ..పరీక్ష ఎప్పుడంటే..

యూజీసీ నెట్‌ (UGC NET 2022) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటల (మే 30)కు ముగుస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపులు కూడా ఈ రోజుతోనే..

UGC NET Exam 2022: మరికొన్ని గంటల్లో ముగుస్తున్న యూసీజీ నెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ..పరీక్ష ఎప్పుడంటే..
Ugc Net 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 26, 2022 | 1:47 PM

UGC NET 2022 Application last date: యూజీసీ నెట్‌ (UGC NET 2022) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5 గంటల (మే 30)కు ముగుస్తుంది. రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లింపులు కూడా ఈ రోజుతోనే ముగియనున్నాయి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ ugcnet.nta. nic.in.లో వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా యూజీసీ సూచించింది. కాగా యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 పరీక్షకోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం మే 20తో యూజీసీ నెట్‌ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియనుండగా.. దానిని మే 30 వరకు పొడిగిస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. మే 31, జూన్ 1 తేదీల్లో యూజీసీ నెట్‌ ఎడిట్‌ విండో ఓపెన్‌ అవుతుంది.

దరఖాస్తు ఫీజు.. జనరల్ అభ్యర్ధులు రూ. 1100, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ. 550, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/థార్డ్‌ జండర్‌ అభ్యర్ధులు రూ. 275 తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) పరీక్ష జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఐతే ఇప్పటి వరకు అధికారికంగా పరీక్ష తేదీని ప్రకటించలేదు. అడ్మిట్‌ కార్డుల విడుదల, పరీక్ష తేదీలను యూజీసీ త్వరలో ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.