Aadhaar: అన్ని పనులకి ఆధార్ ఉపయోగించవద్దు.. దుర్వినియోగం అయ్యే అవకాశాలు..!
Aadhaar:మీ ఆధార్ కార్డుని ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. దీనివల్ల దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)హెచ్చరిస్తుంది.
Aadhaar:మీ ఆధార్ కార్డుని ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. దీనివల్ల దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)హెచ్చరిస్తుంది. ఆధార్ ఫోటోకాపీని తెలివిగా ఉపయోగించాలని సూచించింది. అయితే ఆధార్ ఎక్కడ ఇవ్వాలి.. ఎక్కడ ఇవ్వకూడదు అనే విషయాలు వినియోగదారులని గందరగోళంలో పడేస్తుంది. ఈ పరిస్థితిలో యూఐడీఏఐ కొన్ని విషయాల గురించి ప్రస్తావించింది. వాటి గురించి తెలుసుకుందాం.
హోటల్, సినిమా హాలు, జిమ్‌లకు వెళ్లి గుర్తింపు కార్డు అడిగితే అక్కడ ఆధార్ ఇవ్వకూడదు. ఇంటి చిరునామా ఆధార్ కార్డులో ఉండటం వల్ల చాలా చోట్ల గుర్తింపు, నివాస ధ్రువీకరణ కోసం ఆధార్‌ను అడుగుతారు. కానీ ఈ పరిస్థితిలో ఆధార్ ఇవ్వకుండా ఓటర్ID, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ ఇవ్వొచ్చు. ప్రైవేట్ సంస్థల్లో ఆధార్ అడిగితే దానికి బదులుగా మరో ఐడీ చూపించవచ్చు. ఒకవేళ మీరు ఆధార్ ఇవ్వవలసి వస్తే దాని స్థానంలో మాస్క్ ఆధార్ ఫోటోకాపీని ఇవ్వవచ్చు. ఎందుకంటే దీనిపై చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉంటాయి. దుర్వినియోగం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆధార్ అవసరం లేదు. KYC కోసం పాన్‌కార్డ్‌ని సమర్పించవచ్చు. ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతాలో ఆధార్‌ను నమోదు చేయడం తప్పనిసరి. మీరు ఈ కేటగిరీలోకి రాకపోతే బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి ఆధార్‌ను అందించాల్సిన అవసరం లేదు. రుణం తీసుకోవడానికి కూడా ఆధార్ తప్పనిసరి కాదు. అయితే KYC డాక్యుమెంట్లలో ఆధార్‌ను ఉపయోగించవచ్చు. మీరు మీ పూర్తి ఆధార్ నంబర్‌ను ఇవ్వకుండా మాస్క్ ఆధార్ కాపీని ఉపయోగించవచ్చు. అలాగే బీమా పాలసీని కొనుగోలు చేయడానికి ఆధార్ తప్పనిసరి కాదు. జీవిత బీమా లేదా మరేఇతర బీమా రెండింటికీ ఆధార్‌ను అందించాల్సిన అవసరం లేదు. మీరు eKYCలో ఆధార్ ఇస్తున్నట్లయితే, జాగ్రత్తగా ఉండాలి. పూర్తి ఆధార్ నంబర్ ఇవ్వడానికి బదులుగా, మీరు మాస్క్డ్ ఆధార్ కాపీని ఇవ్వొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి