RBI Orders: బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. ఇకపై రుణం తీసుకునే వారికి ఆ విషయం చెప్పాల్సిందే..!

భారతదేశంలో బ్యాంకులన్నీ ఆర్‌బీఐ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పని చేస్తాయి. అయితే రుణాల విషయంలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు రుణగ్రహీతలకు రుణాలకు సంబంధించిన నిజమైన ఖర్చుల గురించి బాగా తెలియజేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ ) అన్ని రిటైల్ మైక్రో, చిన్న & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) రుణాల కోసం 'కీ ఫాక్ట్ స్టేట్‌మెంట్' (కేఎఫ్ఎస్) జారీ చేయాలని రుణదాతలందరినీ ఆదేశించింది.

RBI Orders: బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు.. ఇకపై రుణం తీసుకునే వారికి ఆ విషయం చెప్పాల్సిందే..!
RBI
Follow us

|

Updated on: Feb 10, 2024 | 8:00 AM

భారతదేశంలో బ్యాంకుల ద్వారా వ్యక్తిగత అవసరాలతో పాటు వ్యాపార అవసరాలకు రుణం తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రుణాలను బ్యాంకుల ద్వారా తీసుకుంటూ ఉంటారు. అయితే భారతదేశంలో బ్యాంకులన్నీ ఆర్‌బీఐ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా పని చేస్తాయి. అయితే రుణాల విషయంలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు రుణగ్రహీతలకు రుణాలకు సంబంధించిన నిజమైన ఖర్చుల గురించి బాగా తెలియజేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ ) అన్ని రిటైల్ మైక్రో, చిన్న & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) రుణాల కోసం ‘కీ ఫాక్ట్ స్టేట్‌మెంట్’ (కేఎఫ్ఎస్) జారీ చేయాలని రుణదాతలందరినీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా ఆదేశాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఇకపై లోన్‌లకు సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజులు, అదనపు ఛార్జీలను బహిర్గతం చేయడానికి స్టేట్‌మెంట్ తప్పనిసర చేసింది. ఎంఎస్ఎంఈల రుణాల్లో ఇతర ప్రాసెసింగ్ ఫీజులు ఉన్నాయి, టర్మ్ లోన్‌లకు ముందస్తు రుసుములు, వర్కింగ్ క్యాపిటల్ కోసం ప్రాసెసింగ్ ఫీజులు వంటివి ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ విడివిడిగా పేర్కొంటున్నారు. అయితే ఈ చార్జీల వివరాలను కీలక ఆర్థిక నివేదికలో వెల్లడించాల్సి ఉంటుంది. బ్యాంకులు విధించే కొన్ని ఛార్జీలు ఒక సారి అయితే మరికొన్ని ప్రతి సంవత్సరం విధించబడే పునరావృత ఛార్జీలు ఉంటాయి. అయితే ఇకపై రుణదాతలు పునరావృత ఛార్జీల ప్రభావాన్ని కూడా పేర్కొనాల్సి ఉంటుంది.

రిటైల్, ఎంఎస్ఎంఈ లోన్ల కోసం కీలక వాస్తవ ప్రకటన వినియోగదారులకు వాస్తవ వార్షిక వడ్డీ రేటు, రుణంతో అనుబంధించిన మొత్తం ఆర్థిక నిబద్ధతపై స్పష్టమైన అవగాహనను అందించడానికి రూపొందించారు. ఆర్‌బీఐ అన్ని రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలు, అడ్వాన్సులను కవర్ చేయడానికి కీలక వాస్తవ ప్రకటనకు సంబంధించిన అవసరాన్ని పొడిగించింది. ఈ చర్య కస్టమర్‌లకు సమగ్ర సమాచారంతో సాధికారత కల్పించడానికి ఒక ముఖ్యమైన దశగా పరిగణిస్తున్నారు. తద్వారా వారు రుణం తీసుకోవడం గురించి సమాచారం తీసుకునేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..