Hyderabad: అయ్యో ఎంత ఘోరం.. పిల్లనిస్తామని ఇంటికి పిలిచారు.. ఆ తర్వాతే అసలు రూపం బయటపెట్టారు!
Hyderabad Crime: ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్లిన ఓ యువకుడి ప్రాణం పోయింది.పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి పిలిచిన అమ్మాయి కుటుంబసభ్యుల చేతిలో ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. హైదరాబాద్ పటాన్‌చెరు లక్ష్మీనగర్‌లో బుధవారం రాత్రి ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది.

పెళ్లి చేస్తామని నమ్మించి ఇంటికి పిలిచి తమ కుమార్తెను ప్రేమించిన అబ్బాయిని అమ్మాయి కుటుంబ సభ్యులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరులో వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమెదు చేసుకన్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకునేందకు దర్యాప్తును వేగవంతం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చదువుతున్న శ్రావణసాయి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో ప్రేమలో ఉన్నాడు. దాదాపు ఏడాదికాలంగా ఇద్దరి మధ్య లవ్ నడుస్తోంది. వారిరువురు ఇటీవలే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలనే ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో.. వారు పెళ్లిని అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అదే సమయంలో శ్రావణసాయి ధైర్యం చేసి యువతితో పెళ్లి గురించి మాట్లాడతానని అమ్మాయి ఇంటికి వెళ్లాడు. కానీ అక్కడ పరిస్థితి అదుపు తప్పింది.
పెళ్లి విషయంపై రెండు కుటుంబాల మధ్య మాటలు యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో అమ్మాయి కుటుంబసభ్యుల్లో ఒకరు చేతిలో ఉన్న బ్యాట్‌తో బెదిరింపులకు దిగాడు, ఈ గందరగోళంలో శ్రావణసాయి తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో శ్రావణ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇక వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కానీ అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి, ఇందులో పాల్గొన్న వారిని కస్టడీలోకి తీసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడి ప్రాణం పోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
