Portable AC: ఎండాకాలం వచ్చేసింది.. చల్లచల్లని ఈ పోర్టబుల్ ఏసీపై ఓ లుక్కేసేయండి మరి.!

ఫిబ్రవరి ముగియలేదు.. శివ.. శివ.. అంటూ చలి పోనులేదు. కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. భానుడి భగభగలు అప్పుడే మొదలయ్యాయి. సాధారణంగా మార్చి నెలాఖరున వేసవికాలం స్టార్ట్ అవుతుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

Portable AC: ఎండాకాలం వచ్చేసింది.. చల్లచల్లని ఈ పోర్టబుల్ ఏసీపై ఓ లుక్కేసేయండి మరి.!
Portable Ac
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 09, 2024 | 7:53 PM

ఫిబ్రవరి ముగియలేదు.. శివ.. శివ.. అంటూ చలి పోనులేదు. కానీ ఎండలు మాత్రం మండిపోతున్నాయి. భానుడి భగభగలు అప్పుడే మొదలయ్యాయి. సాధారణంగా మార్చి నెలాఖరున వేసవికాలం స్టార్ట్ అవుతుంది. అయితే వాతావరణ మార్పుల కారణంగా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు తగ్గాయి.. ఎండలు అదురుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఎండలు ముందే వచ్చేశాయి. మరి ఈ వేడి నుంచి మనల్ని మనం ఉపశమనం దక్కించుకోవాలంటే.. ఇంట్లో ఓ ఏసీ ఉండాల్సిందే. అయితే గోడ ఏసీ, లేదా కూలర్ ప్రస్తుతం భారీ ధరలు పలుకుతాయి. మరి పోర్టబుల్ ఏసీపై ఓసారి లుక్ ఎందుకు వెయ్యకోడదు చెప్పండి. మీకోసం ఓ పోర్టబుల్ ఏసీని తీసుకొచ్చేశాం. దాని ఫీచర్లు చూసేద్దాం.

కేవలం 610 గ్రాముల బరువు ఉండే ఈ పోర్టబుల్ ఏసీని.. మనం ఈజీగా ఒక చోట నుంచి ఇంకో చోటకు తీసుకెళ్లవచ్చు. స్టడీ రూమ్, ఆఫీస్, లేదా పిక్నిక్‌కి వెళ్లేటప్పుడు.. ఎక్కడైనా వాడొచ్చు. ఈ పోర్టబుల్ ఏసీలో 2000mAh బ్యాటరీ అమర్చబడి ఉంది. ఇది ఒక్కసారి ఖాళీ అయితే.. 3 గంటల పాటు చార్జింగ్ అవుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 4 గంటల పాటు చల్లటి గాలిని అందిస్తుంది. ఇక ఈ ఛార్జ్ కోసం 9 వోల్ట్‌ల కరెంట్ వినియోగం అవుతుంది. కాగా, ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ. 3 వేల నుంచి 3,300 మధ్య ఉంది. ఓసారి మీరూ చూసేయండి(Source)