AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IEW 2024: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైడ్రాలిక్ రిగ్గులు.. ‘మేఘా’ కృషిని అభినందించిన కేంద్ర మంత్రి

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైడ్రాలిక్‌ ఓవర్‌ ఆటోమాటిక్ రిగ్గులు తయారు చేసిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యాన్ని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి అభినందించారు. మేక్‌ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్‌ కార్యక్రమాలకు ఇదెంతో ప్రోత్సాహాన్నిస్తుందని సంస్థ కృషిని కొనియాడారు.

IEW 2024: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైడ్రాలిక్ రిగ్గులు.. 'మేఘా' కృషిని అభినందించిన కేంద్ర మంత్రి
Hardeep Singh Puri
Basha Shek
|

Updated on: Feb 09, 2024 | 7:34 PM

Share

స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైడ్రాలిక్‌ ఓవర్‌ ఆటోమాటిక్ రిగ్గులు తయారు చేసిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యాన్ని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి అభినందించారు. మేక్‌ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్‌ కార్యక్రమాలకు ఇదెంతో ప్రోత్సాహాన్నిస్తుందని సంస్థ కృషిని కొనియాడారు. వివరాల్లోకి వెళితే.. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిగా ఆటోమేటిక్ పద్దతిలో పనిచేసే HH 150 హైడ్రాలిక్ వర్క్ ఓవర్ రిగ్ లను MEIL, దాని అనుబంధ సంస్థ డ్రిల్ మెక్ సంయుక్తంగా రూపొందించాయి. గోవాలో జరుగుతోన్న ఇండియా ఎనర్జీ వీక్-2024లో భాగంగా వీటిని ప్రదర్శించాయి. కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ హైడ్రాలిక్‌ ఆటోమాటిక్‌ రిగ్గులను పరిశీలించారు. MEIL మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డిని అడిగి వీటి పని తీరును తెలుసుకున్నారు. రిగ్ అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని, అలాగే 55 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం అభినందనీయమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా మేఘా యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో 55 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన అత్యంత అధునాతనమైన, భద్రతా పరమైన రిగ్ ను గోవా ఎనర్జీ వీక్‌ లో చూడటం సంతోషంగా ఉంది. ONGC కి MEIL సంస్థ 20 రిగ్ లను అందిస్తోందని, దేశ ఇంధన రంగ ప్రయాణంలో ఇదొక శుభ పరిణామం’ అని ట్విట్టర్‌ లో రాసుకొచ్చారు కేంద్ర మంత్రి.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా MEIL మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన 20 అత్యాధునిక రిగ్గులు ONGCకి సరఫరా చేస్తున్నామని తెలిపారు. వీటి తయారీలో ఉపయోగించిన 55 శాతం పనిముట్లు మన దేశంలోనే తయారయ్యాయని ఆయన తెలిపారు. ఇలాంటి మరిన్ని రిగ్గుల తయారు చేసేందుకు తమ సంస్థ సిద్ధమవుతోందని కృష్ణా రెడ్డి వెల్లడించారు. చమురు, సహజ వాయు రంగాలకు సంబంధించి భారత్‌ ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అవసరమైన ఉత్సాదనలను తమ సంస్థ రెడీ చేస్తుందన్నారు కృష్ణా రెడ్డి. కాగా గోవాలో జరుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్-2024లో MEIL అనుబంధ సంస్థలు మేఘా గ్యాస్, ఓలెక్ట్రా, ఈవేట్రాన్స్, ఐకామ్ కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..