FD Interest Rates: ఎఫ్‌డీల విషయంలో అన్ని బ్యాంకులదీ అదే దారి.. ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి

ఎఫ్‌డీల ద్వారా 15 సంవత్సరాల దూరంలో ఉన్న మీ పిల్లల ఉన్నత విద్య కోసం పొదుపు చేయడం ప్రభావవంతంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎఫ్‌డీకు సంబంధించిన పన్ను అనంతర వడ్డీ రేటు మీకు నిజమైన రాబడిని ఇవ్వకపోవచ్చు. అయితే ఫిబ్రవరి 1 నుంచి పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి.

FD Interest Rates: ఎఫ్‌డీల విషయంలో అన్ని బ్యాంకులదీ అదే దారి.. ఎక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి
Money
Follow us
Srinu

|

Updated on: Feb 09, 2024 | 7:30 AM

పెట్టుబడికి నమ్మకమైన రాబడి కోసం చాలా మంది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)ల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. గ్యారెంటీ ఆదాయం కోసం వెతుకుతున్న సీనియర్ సిటిజన్‌లతో పాటు రిస్క్‌ను భరించలేని పెట్టుబడిదారులలో ఎఫ్‌డీలను ఆశ్రయిస్తూ ఉంటారు. ఎఫ్‌డీల ద్వారా 15 సంవత్సరాల దూరంలో ఉన్న మీ పిల్లల ఉన్నత విద్య కోసం పొదుపు చేయడం ప్రభావవంతంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎఫ్‌డీకు సంబంధించిన పన్ను అనంతర వడ్డీ రేటు మీకు నిజమైన రాబడిని ఇవ్వకపోవచ్చు. అయితే ఫిబ్రవరి 1 నుంచి పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నేపథ్యంలో వివిధ కాల వ్యవధిలో రూ.1 కోటి వరకు డిపాజిట్లకు అత్యధిక ఎఫ్‌డీలకు రేట్లను అందించే బ్యాంకుల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

మూడేళ్ల లోపు వడ్డీ రేట్లు ఇవే

  • డీసీబీ బ్యాంక్: 6 నెలల నుంచి ఓ సంవత్సరం ఎఫ్‌డీలపై 6.25 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే ఓ ఏడాది నుంచి రెండేళ్ల లోపు  7.15 శాతం నుంచి 7.85 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై 7.55 శాతం నుంచి 8.00 శాతం వడ్డీను అందిస్తుంది. 
  • యాక్సిస్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంక్ 6 నెలల నుంచి ఓ సంవత్సరం ఎఫ్‌డీలపై 5.75 శాతం నుంచి 6.00 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే ఓ ఏడాది నుంచి రెండేళ్ల లోపు  6.70 శాతం నుంచి 7.10 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీను అందిస్తుంది. 
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: 6 నెలల నుంచి ఓ సంవత్సరం ఎఫ్‌డీలపై 4.50 శాతం నుంచి 6.00 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే ఓ ఏడాది నుంచి రెండేళ్ల లోపు  6.60 శాతం నుంచి 7.10 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై 7.00 శాతం నుంచి 7.15 శాతం వడ్డీను అందిస్తుంది. 
  • ఇండస్ ఇండ్ బ్యాంక్: 6 నెలల నుంచి ఓ సంవత్సరం ఎఫ్‌డీలపై 5.00 శాతం నుంచి 6.35 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే ఓ ఏడాది నుంచి రెండేళ్ల లోపు  7.50 శాతం వడ్డీను అంది్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై 7.25 శాతం నుంచి 7.50 శాతం వడ్డీను అందిస్తుంది. 
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్: 6 నెలల నుంచి ఓ సంవత్సరం ఎఫ్‌డీలపై 4.50 శాతం నుంచి 5.75 శాతం వడ్డీ అందిస్తుంది. అలాగే ఓ ఏడాది నుంచి రెండేళ్ల లోపు  6.50 శాతం నుంచి 7.75 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు డిపాజిట్లపై 7.25 శాతం నుంచి 7.75 శాతం వడ్డీను అందిస్తుంది. 

మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు వడ్డీ రేట్లు

  • డీసీబీ బ్యాంక్: ఈ బ్యాంకు మూడేళ్ల ఐదేళ్ల లోపు ఎఫ్‌డీలపై 7.40 శాతం నుంచి 7.90 శాతం వడ్డీ రేట్లు అందిస్తారు. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7.25 శాతం నుంచి 7.65 శాతం వరకూ వడ్డీ రేట్లు అందిస్తుంది. 
  • యాక్సిస్ బ్యాంక్: ఈ బ్యాంకు మూడేళ్ల ఐదేళ్ల లోపు ఎఫ్‌డీలపై 7.10 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7.00 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. 
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ బ్యాంకు మూడేళ్ల ఐదేళ్ల లోపు ఎఫ్‌డీలపై 7.00 శాతం నుంచి 7.20 శాతం వడ్డీ రేట్లు అందిస్తుంది. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7.00 శాతం  వడ్డీ రేటు అందిస్తుంది. 
  • ఇండస్ ఇండ్ బ్యాంక్: ఈ బ్యాంకు మూడేళ్ల ఐదేళ్ల లోపు ఎఫ్‌డీలపై 7.25 శాతం వడ్డీ రేటు అందిస్తుంది. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7.00 శాతం నుంచి 7.25 శాతం వరకూ వడ్డీ రేట్లు అందిస్తుంది. 
  • ఐడీఎఫ్‌సీ ఫస్ట్  బ్యాంక్: ఈ బ్యాంకు మూడేళ్ల ఐదేళ్ల లోపు ఎఫ్‌డీలపై 7.00 శాతం నుంచి 7.25 శాతం వడ్డీ రేట్లు అందిస్తుంది. అలాగే ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు 7.00 శాతం  వడ్డీ అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!