Kids Education: మీ పిల్లల చదువు కోసం పొదుపు చేసేందుకు.. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు తిరుగుండదు..

చదువులకు సమబంధించిన వివిధ రకాల కోర్సుల ఫీజులను తెలుసుకున్నపుడు రంజిత్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే.. ఇంజనీరింగ్ కోర్సులకు 12 నున్చి 20 లక్షల రూపాయలు.. మెడికల్ కోర్సులకు 30 లక్షల నుంచి కోటి రూపాయలు.. ఎంబీఏ లాంటి కోర్సుల కోసం 25 లక్షల రూపాయల వరకూ..

Kids Education: మీ పిల్లల చదువు కోసం పొదుపు చేసేందుకు.. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు తిరుగుండదు..
Child Education
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 11, 2023 | 5:22 AM

చదువులకు సమబంధించిన వివిధ రకాల కోర్సుల ఫీజులను తెలుసుకున్నపుడు రంజిత్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే.. ఇంజనీరింగ్ కోర్సులకు 12 నున్చి 20 లక్షల రూపాయలు.. మెడికల్ కోర్సులకు 30 లక్షల నుంచి కోటి రూపాయలు.. ఎంబీఏ లాంటి కోర్సుల కోసం 25 లక్షల రూపాయల వరకూ ఫీజులు ఉన్నాయి. ఇది తెలుసుకున్న వెంటనే భవిష్యత్తులో తన ఆరేళ్ళ కొడుకు ఉన్నత చదువుల కోసం ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందో రంజిత్ ఆలోచనలకు కూడా అందలేదు. ఈ ఫీజుల గురించి ఆలోచిస్తే పేద, మధ్య తరగతులకు చెందిన వారి  మైండ్ బ్లాంక్ అవుతుంది.  ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువు పూర్తయ్యే సమయానికి వివిధ రకాల ఖర్చులు ఉంటాయి. ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజులు పెరుగుతాయి, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. అలాగే మీ పిల్లలు మీ ఇంటికి దూరంగా మరొక నగరంలో చదువుకోవడానికి వెళితే, అప్పుడు అక్కడ అయ్యే ఖర్చులను కూడా కలిపి చూసుకుంటే ఈ చదువుల కోసం అయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అయితే, విద్యా ఖర్చు కేవలం ఇన్స్టిట్యూట్ ఖర్చులు.. కోర్సుల ఫీజుల ద్వారా మాత్రమే లెక్క వెయ్యలేం. దీనికి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అందుకే పిల్లల ఉన్నత చదువుల కోసం చాలా ముందుగానే ఆలోచించి లెక్కలు వేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అవసరం.

పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడం అనేది తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత అలాగే లక్ష్యం గా కూడా ఉంటుంది. దీని కోసం, డబ్బు ఆదా చేయడం ఒక్కటే సరిపోదు, పెట్టుబడి పెట్టడం కూడా అవసరం. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌కు మీరు ఎంత ఎక్కువ సమయం ఇస్తే, రాబడులకు అంత మంచి స్కోప్ ఉంటుంది.  రాబడి కోరుకునేవారు ఈక్విటీ. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం 8-10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంటే, అటువంటి కాలపరిమితిలో, మ్యూచువల్ ఫండ్స్ సాధారణంగా 12-14% వార్షిక రాబడి ఇస్తున్న ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంటాయి.

మీ చేతుల్లో ఎంత సమయం ఉందో దాని ప్రకారం, మీరు మ్యూచువల్ ఫండ్లను ఎలా ఎంచుకోవాలో అర్థం చేసుకోండి. మీకు 5 సంవత్సరాల కంటే తక్కువ సమయం ఉంటే, డెట్ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. 6-7 సంవత్సరాల సమయం ఉంటే, అప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి. 10 సంవత్సరాల వరకు సమయం ఉంటే, పెద్ద క్యాప్‌లతో పాటు మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లు మంచి ఎంపిక. మీరు ప్రతి నెలా 10,000 రూపాయల SIP తీసుకుంటే, 12 శాతం రాబడిని ఊహిస్తే, మీరు 5 సంవత్సరాలలో మొత్తం 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు. మీ రాబడి 8,24,864 రూపాయలు అంటే 2,24,864 రూపాయల లాభం. కానీ మీరు అదే 10,000 ను 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి మొత్తం 12 లక్షల రూపాయలు మరియు మొత్తం రాబడి 23,23,391 రూపాయలు. అంటే మీరు 11,23,391 రూపాయల అధిక రాబడిని పొందుతారు. అందువల్ల, పిల్లవాడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు, పెట్టుబడిని ముందుగానే ప్రారంభించడం చాలా ముఖ్యం, తద్వారా మీరు పెద్ద కార్పస్‌ను సంపాదించవచ్చు. దీంతో మీ పిల్లవాడి ఉన్నత విద్య కోసం ఖర్చుల ఇబ్బందిని సులభంగా అధిగమించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?