Advance tax: ముందస్తు పన్ను చెల్లించే విధానం గురించి తెలుసా.. ఎప్పుడెప్పుడు ఎంతెంత చెల్లించాలంటే..

Advance tax: ఎక్కడ సంపాదన ఉంటుందో అక్కడ ఇన్ కం టాక్స్ కట్టాల్సిందే. సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై ఏడాది చివర్లో ఆదాయపు పన్ను లెక్కలు చెప్పాలి. టాక్స్ కట్టాలి. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కంటే ముందే..

Advance tax: ముందస్తు పన్ను చెల్లించే విధానం గురించి తెలుసా.. ఎప్పుడెప్పుడు ఎంతెంత చెల్లించాలంటే..
Advance Tax
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 11, 2023 | 5:09 AM

Advance tax: ఎక్కడ సంపాదన ఉంటుందో అక్కడ ఇన్ కం టాక్స్ కట్టాల్సిందే. సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై ఏడాది చివర్లో ఆదాయపు పన్ను లెక్కలు చెప్పాలి. టాక్స్ కట్టాలి. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కంటే ముందే టాక్స్ కడతారనే విషయం మీకు తెలుసా? దీనినె అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. ప్రభుత్వం టాక్స్ పేయర్స్ కు ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం క్యాష్ ఫ్లో నిరంతరంగా ఉండటానికి ఈ పథకం ప్రవేశపెట్టినది.  ఏకమొత్తంలో పన్ను చెల్లించే బదులు దీనిని వాయిదాల్లో చెల్లించవచ్చు.  అడ్వాన్స్ టాక్స్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం.. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఆర్థిక సంవత్సరం ముగింపు కంటే ముందుగా చెల్లించే ఆదాయపు పన్ను.  దీనిని పూర్తిగా ఒకే సారి చెల్లించే బదులు ప్రతి త్రైమాసికంలో టాక్స్ పేయర్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, టాక్స్ పేయర్ మొత్తం ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని లెక్కించాలి. దీని ఆధారంగా నిర్దిష్ట వ్యవధిలో పన్ను చెల్లించాలి.  అంటే మీరు ఏ ఆర్థిక సంవత్సరంలో ఆర్జిస్తున్నారో అదే ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. 

ఇప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ ఎవరు చెల్లించాలి అనే విషయాన్ని పరిశీలిద్దాం. ఆర్థిక సంవత్సరంలో 10 వేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించే ప్రతి టాక్స్ పేయర్ ముందస్తు పన్ను చెల్లించాలి.  అతను ఉద్యోగం చేసినా, వ్యాపారం చేస్తున్నా లేదా ఏదైనా వృత్తిలో నిమగ్నమై ఉన్నా .సరే ఈ పని చేయాల్సి ఉంటుంది. అయితే జీతం తీసుకుంటున్నవారు ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ యజమాని TDS కట్ చేసి జీతం చెల్లిస్తారు కాబట్టి జీతం తీసుకుంటున్న వారు అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, అటువంటి టాక్స్ పేయర్స్ జీతం కాకుండా అద్దె, వడ్డీ లేదా డివిడెండ్ వంటి ఆదాయాన్ని కలిగి ఉంటే మాత్రం అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సిందే.  సాధారణంగా వ్యాపారవేత్తలు లేదా నిపుణులు అడ్వాన్స్ టాక్స్ చెల్లిస్తారు. . 60 ఏళ్లు పైబడిన వారికి అడ్వాన్స్ టాక్స్ చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. వారికి ఎలాంటి వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం ఉండకూడదనే షరతు కూడా ఉంది. ఒకవేళ వ్యాపారం లేదా వృత్తి ఉంటే వారు కూడా అడ్వాన్స్ టాక్స్ పరిధిలోకి వస్తారు. 

ముందస్తు పన్ను ఎప్పుడు, ఎంత చెల్లించాలి 

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ను నాలుగు భాగాలుగా విభజించారు. మొదటి విడత జూన్‌ 15, రెండో విడత సెప్టెంబర్‌ 15, మూడో విడత డిసెంబర్‌ 15, చివరి విడత మార్చి 15. జూన్ 15లోగా మొత్తం పన్నులో 15 శాతం అడ్వాన్స్‌ ట్యాక్స్‌గా జమ చేయాలి.  సెప్టెంబర్ 15 నాటికి 45 శాతం, డిసెంబర్ 15 నాటికి 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం టాక్స్ కట్టేయాలి. ఒకవేళ సకాలంలో టాక్స్ చెల్లించలేకపోతే జరిమానా విధిస్తారు. 

ఇవి కూడా చదవండి

అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించడంలో విఫలమైతే సెక్షన్ 234బి, సెక్షన్ 234సి కింద వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని న్యాయవాది, పన్ను నిపుణుడు గౌరవ్ గుప్తా వివరించారు. ఉదాహరణకు, మీరు సెప్టెంబరు 15 గడువుకు అడ్వాన్స్ టాక్స్ కట్టలేకపోతే.. మీరు 3 నెలల పాటు వడ్డీని చెల్లించాలసి వస్తుంది. ఇది నెలకు 1% వడ్డీ రేటు పై ఉంటుంది. ఒకవేళ ఎవరైనా టాక్స్ పేయర్ ఎక్కువ అడ్వాన్స్ టాక్స్ చెల్లించినట్లయితే, అతను ఆదాయపు పన్ను రిటర్న్ ని సబ్మిట్ చేయడం ద్వారా  ద్వారా వాపసును క్లెయిమ్ చేయవచ్చు 

అడ్వాన్స్ టాక్స్ దాఖలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నప్పుడు, పన్ను చెల్లింపుదారుడు సరైన అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఇవ్వాలి. అలాగే,  పాన్ నంబర్ సరైనదని నిర్ధారించుకోవాలని గుప్తా వివరించాఋ. అలాగే, ముందస్తు పన్నును లెక్కించేటప్పుడు, పన్ను చెల్లింపుదారుడు TDS, డిడక్షన్‌ను తీసివేయవలసి ఉంటుంది. అంచనా వేసిన మొత్తం పన్ను, పన్ను మినహాయింపును తీసివేసిన తర్వాత మిగిలి ఉన్న పన్ను మొత్తాన్ని ముందస్తు పన్నుగా జమ చేయాలి.

ముందస్తు పన్ను ఎలా డిపాజిట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అడ్వాన్స్ ట్యాక్స్ ఫైల్ చేయడం చాలా సులభం. దీని కోసం మీరు ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి (https://www.incometax.gov.in/) వెళ్లి e- టాక్స్ పే అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పాన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత మీరు అడ్వాన్స్ ట్యాక్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. మీరు చలాన్ నంబర్ 208 ద్వారా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు నిర్దేశించిన అధీకృత బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయవచ్చు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!