AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: దొరికేసింది మావా.. బన్నీ పక్కన మెరిసిన ఈ మెరుపుతీగ ఎవరో తెలుసా..?

పుష్ప 2 సినిమాలో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు మోత మోగిపోతున్నాయి. అయితే అల్లు అర్జున్‌తో ఓ అమ్మాయి కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది దీంతో అసలు ఆ అమ్మాయి ఎవరు అంటూ సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. తనెవరో తెలుసుకుందాం పదండి...

Pushpa 2: దొరికేసింది మావా.. బన్నీ పక్కన మెరిసిన ఈ మెరుపుతీగ ఎవరో తెలుసా..?
Allu Arjun - Urvashi Apsara
Ram Naramaneni
|

Updated on: Dec 29, 2024 | 8:30 AM

Share

గతం వారం రోజులుగా సోషల్ మీడియాను ఓ వీడియో తెగ ఊపేస్తుంది. అది పుష్ప2 సాంగ్ మేకింగ్‌కి సంబంధించిన వీడియో. అందులో అల్లు అర్జున్ పక్కన పింక్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఓ యువతి మెస్మరైజింగ్ లుక్స్‌తో.. మెరుపు తీగలా మూమెంట్స్‌తో అదరగొట్టింది. కిస్సిక్ సాంగ్ మేకింగ్ సందర్భంగా ఐకాన్ స్టార్‌తో కలిసి ఈ బ్యూటీ చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో నెటిజన్లకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దీంతో ఎవరీ అమ్మాయి? ఇన్‌స్టా ఐడీ ఇస్తే లైఫ్ ఇస్తాం అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇక మనవాళ్లు ఆగుతారా చెప్పండి.. ఆమె ఇన్ స్టా ఐడీతో పాటు పుట్టుపూర్వోత్తరాలు కనిపెట్టేశారు.

ఊర్వశి అప్సర

ఈ వీడియోలో బన్నీ పక్కన డ్యాన్స్ చేసిన అమ్మాయి పేరు ఊర్వశి అప్సర. ఈమె పుష్ప 2 చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది. థియేటర్లో ఓ ఊపు ఊపేస్తున్న కిస్సిక్ సాంగ్‌కి ఈమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అంటే సాంగ్ కొరియోగ్రఫి చేసిన గణేశ్ ఆచార్య మాస్టర్ వద్ద తను అసిస్టెంట్‌గా చేస్తోంది. ఇప్పుడు కొత్తేం కాదు… పుష్ప చిత్రంలోని “ఊ అంటావా మావా” పాటకి కూడా ఈమె వర్క్ చేసింది. ఊర్వశీ బెల్లి డ్యాన్స్‌లో ఎక్స్‌పర్ట్. అంతేకాదు.. యోగా ట్రైనర్ కూడా. నటిగా కూడా పలు సినిమాల్లో మెరిసింది. ’31 డిసెంబర్’, ‘కిట్టి పార్టీ’, ‘అనంత్’, ‘పింటు కి పప్పి’ వంటి మూవీస్‌లో నటించింది. చాలామంది సెలబ్రెటీలతో పనిచేసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాకారుకు సెగలు రేపుతోంది ఈ బ్యూటీ.

ఇప్పటివరకూ మన వాళ్లకు ఈమె గురించి పెద్దగా తెలియదు. కానీ బన్నీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆమె పేరు మారుమోగిపోతుంది. ఆమె వీడియో చూసిన కొందరు.. అసలు ఈమెతోనే ఆ కిస్సిక్ సాంగ్ చేయిస్తే నెక్ట్స్ లెవల్‌ కదా అని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఒక్క మేకింగ్ వీడియోతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతేలెండి. సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతాడో మనం చెప్పలేం కదా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..