- Telugu News Photo Gallery Business photos Apple premium smartphone exchange offer, Opportunity to buy iPhone 16 cheap on Flipkart 38 thousand
iPhone: ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
iPhone 16 Bumper Discount: ఆన్‌లైన్‌లో స్మార్ట్ ఫోన్ లపై ఎన్నో ఆఫర్ల ఉంటున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లతో భారీ డిస్కౌంట్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఐ ఫోన్‌పై కూడా బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్ ఉంది..
Updated on: Dec 28, 2024 | 8:44 PM

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. తమ సేల్స్‌ను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్లను అందిస్తున్నాయి. తక్కువ ధరల్లో మొబైల్‌లను అందిస్తున్నాయి. ఇక ఐఫోన్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిలో ఐఫోన్ 16 అత్యంత ప్రాచుర్యం పొందింది.

ఈ ఏడాది ముగిసేలోపు రూ.45,000 కంటే తక్కువ ధరకే iPhone 16ని కొనుగోలు చేసే అవకాశం దక్కించుకోవచ్చు. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 38150 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో అందుబాటులో ఉంది.

iPhone 16 128 GB వేరియంట్ ధర రూ. 79,990, అలాగే 256 GB వేరియంట్ ధర రూ. 89,990. 256GB వేరియంట్ ధర రూ.1,09,990 ఉంది.

ఐఫోన్ 16 128 GB వేరియంట్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 41750కి కొనుగోలు చేయవచ్చు. ప్రతి స్మార్ట్‌ఫోన్‌కు వేర్వేరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉంటాయి. ధర కూడా మీ స్మార్ట్‌ఫోన్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో iPhone 16 256 GB వేరియంట్‌ను రూ. 51,750కి కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో iPhone 16 512 GB వేరియంట్‌ను రూ.71,750కి కొనుగోలు చేయవచ్చు.




