AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సైకో లవ్.. తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే దారుణం.. వీడియో వైరల్..

ఆనందంతో ఉండాల్సిన పెళ్లి వేదిక రక్తసిక్తమైంది. వరుడి మెడలో దండ వేస్తుండగా వధువుపై ఓ దుండుగుడు కాల్పులు జరిపాడు. దాంతో వధువు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ప్రాణాపాయ స్థితిలో వధువు తనను ఎవరు కాల్చారో చెప్పింది. అసలు ఆమెను కాల్చింది ఎవరు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Video: సైకో లవ్.. తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే దారుణం.. వీడియో వైరల్..
Buxar Bride Shot During Wedding
Krishna S
|

Updated on: Feb 25, 2026 | 5:06 PM

Share

ఒకవైపు మంగళవాయిద్యాలు, మరోవైపు బంధుమిత్రుల కోలాహలంతో ఆ పెళ్లి వేదిక కళకళలాడుతోంది. సరిగ్గా వరుడు, వధువు దండలు మార్చుకుంటున్న వేళ.. ఆ సంతోషం ఒక్కసారిగా విషాదంగా మారింది. ముసుగు ధరించి వచ్చిన ఒక వ్యక్తి, అందరూ చూస్తుండగానే వధువుపై కాల్పులు జరిపి పారిపోయాడు. బీహార్‌లోని బక్సర్ జిల్లా చౌసా నగర్ పంచాయతీలో ఈ దారుణం చోటుచేసుకుంది. నంద్జీ మల్లా కుమార్తె ఆర్తి కుమారికి ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. మంగళవారం రాత్రి వేడుక ఘనంగా జరుగుతోంది. స్టేజ్ మీద వేడుక సాగుతుండగా, ఒక ఆగంతకుడు వేదికపైకి వచ్చి… తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆర్తి కడుపులో కాల్చాడు. సంగీత హోరులో మొదట ఆ శబ్దం ఎవరికీ వినిపించలేదు కానీ ఆర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆర్తిని వెంటనే బక్సర్ సదర్ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వారణాసికి తరలించారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతోంది. అయితే స్పృహ కోల్పోయే ముందు ఆర్తి తన కుటుంబ సభ్యులతో ఒక కీలక విషయం చెప్పింది. తనను కాల్చింది పొరుగునే ఉండే దీనబంధు అని పేరు వెల్లడించింది. కుటుంబ సభ్యుల ప్రకారం.. దీనబంధు గత రెండేళ్లుగా ఆర్తిని వేధిస్తున్నాడు. ఆమె అతనిని తిరస్కరించినప్పటికీ, ప్రేమ పేరుతో వెంటాడేవాడు. గతంలో ఆర్తికి మరో సంబంధం కుదిరినప్పుడు, వరుడి కుటుంబాన్ని బెదిరించి ఆ పెళ్లిని కూడా చెడగొట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న కక్షతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న ముఫాసిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఇది వ్యక్తిగత కక్షతో జరిగిన దాడిగానే కనిపిస్తోందని, నిందితుడు దీనబంధు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..