షాపింగ్ లో ఈ చిట్కాలు పాటిస్తే అనవసర ఖర్చును తగ్గించుకోవచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..

నేటి కాలంలో షాపింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది. ఎవరికి వారు తమ స్థోమతను బట్టి షాపింగ్ చేస్తుంటారు. అధిక ఆదాయం ఉన్నవాళ్లతో పోలిస్తే షాపింగ్ సమయంలో మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్లాన్ లేకుండా షాపింగ్‌కు వెళ్లడం, ఆ తర్వాత.. మాల్స్‌లో..

షాపింగ్ లో ఈ చిట్కాలు పాటిస్తే అనవసర ఖర్చును తగ్గించుకోవచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్..
Shooping In Mall (Representative Image)
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 11, 2023 | 9:25 AM

నేటి కాలంలో షాపింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది. ఎవరికి వారు తమ స్థోమతను బట్టి షాపింగ్ చేస్తుంటారు. అధిక ఆదాయం ఉన్నవాళ్లతో పోలిస్తే షాపింగ్ సమయంలో మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ప్లాన్ లేకుండా షాపింగ్‌కు వెళ్లడం, ఆ తర్వాత.. మాల్స్‌లో అనేక వస్తువులకు ఆకర్షితులవడం, కొన్ని సందర్భాల్లో వస్తువులను కొనలేకపోవడం, మరికొన్ని సందర్భాల్లో ఆకర్షించే అన్ని వస్తువులను కొని.. బిల్లు చూసి బాధపడటం వంటివి సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువుగా చూస్తూ ఉంటాం. అసలు ధనవంతులైనా, పేద, మధ్యతరగతి.. ఇలా ఏ వర్గానికి చెందినవారైనా.. తమ షాపింగ్‌ను ప్రోపర్‌గా ప్లాన్ చేసుకుంటే.. వృధా ఖర్చును తగ్గించుకోవచ్చు. ఓ అధ్యయనం ప్రకారం సాధారణంగా షాపింగ్‌కు వెళ్లేవారిలో అధికశాతం మంది తమకు కావల్సిన వస్తువులకంటే ప్రస్తుతం అంతగా అవసరం లేని వస్తువలపైనే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేసి.. షాపింగ్‌ను ప్రొపర్‌గా ప్లాన్ చేసుకున్నవారికి అయ్యే ఖర్చు చాలా తక్కువ అయినట్లు తెలింది.

ఏమి కావాలో ముందుగానే ఆలోచన

షాపింగ్‌కు వెళ్లే ముందుగా అసలు ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువుల అవసరమో ఒక లిస్ట్ తయారుచేసుకోవాలి. ఇలా చేయడం వలన మన ఫోకస్ ముందుగా మనకు అవసరమైన వస్తువుల వైపే మళ్లుతుంది. మరోవైపు మన ఇంట్లో ఉండే వస్తువులనే మరోసారి షాపింగ్‌ బాస్కెట్‌లో వేసుకుంటే అనవసర ఖర్చు పెరుగుతుంది.

తక్కువ మోతాదు వస్తువులు ముందుగా

ఏ వస్తువులు అయితే తక్కువ మోతాదులో కొనాలనుకుంటున్నామో వాటిని ముందుగా తీసుకుని బాస్కెట్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రోజెన్-ఫుడ్స్ సెక్షన్‌కు వెళ్లాలి, ఆ తర్వాత క్యాన్డ్ ఫుడ్ దగ్గరకు వెళ్లడం బెటర్. తాజా ఫుడ్స్ కంటే ఫ్రోజెన్ మీట్, చేపలు, కూరగాయలు ఎప్పుడూ ధర తక్కువే ఉంటాయి. తాజా ఫుడ్స్ కంటే ముందే ఫ్రోజెన్ సెక్షన్‌కు వెళ్తే కచ్చితంగా కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వృధా అయ్యే వస్తువులను ఇగ్నోర్ చేయండి

కొన్ని పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల అవి పాడైపోతాయి. దీంతో వాటిపై పెట్టిన ఖర్చు అనవసర ఖర్చు కిందకే వస్తుంది. అందుకే వస్తువులు పాడైపోకుండా ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేసుకోవడం ద్వారా వాటిపై పెట్టిన ఖర్చును ఆదా చేసుకోవచ్చు.  పైన పేర్కొన్న సింపుల్ టిప్స్ పాటించడం వల్ల మన షాపింగ్ లో అనవసర ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల చూడండి..

తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి