Honda H’ness CB350: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హోండా కొత్త బైక్! స్టన్నింగ్ లుక్.. సూపర్ ఫీచర్స్.. ఓ లుక్కేయండి..
ఇది హోండా హైనెస్ సీబీ350 బైక్ సారూప్యంలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన టీజర్ ను హోండా ఇటీవలే విడుదల చేసింది. దీని లుక్, డిజైన్ అంతా కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ మోడల్లోనే ఉంటుంది. చూడటానికి క్లాసీ లుక్ ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ ను హోండాకు చెందిన బిగ్ వింగ్ అవుట్ లెట్స్ లో విక్రయించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.

దేశంలోని ప్రముఖ బ్రాండ్ అయిన హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ కంపెనీ రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ బైక్ పోటీగా ఓ కొత్త బైక్ ను తీసుకొస్తోంది. ఇది హోండా హైనెస్ సీబీ350 బైక్ సారూప్యంలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన టీజర్ ను హోండా ఇటీవలే విడుదల చేసింది. దీని లుక్, డిజైన్ అంతా కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ మోడల్లోనే ఉంటుంది. చూడటానికి క్లాసీ లుక్ ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ ను హోండాకు చెందిన బిగ్ వింగ్ అవుట్ లెట్స్ లో విక్రయించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఈ హోండా బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
టీజర్లో ఓ ఏముందంటే..
హోండా విడుదల చేసిన టీజర్లో బైక్ లుక్ కేకపెట్టించింది. స్ల్పిట్ సీట్ సెటప్ తో పాటు ట్రేడిషనల్ గ్రాబ్ రెయిల్ ఉంది. ఇంతకు ముందు ఉన్న హైనెస్ మోడల్ బైక్ లో ఉన్నట్లే స్విచ్ గేర్ ఇచ్చారు. ముందు వైపు నిస్సిన్ కాలిపర్ డిస్క్ బ్రేక్, షాక్ అడ్జర్బర్ అచ్చంగా రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లో ఉన్నట్లు ఉన్నాయి. ఈ బైక్ కు పోటీగానే హోండా హైనెస్ సీబీ350 బైక్ ను తీసుకొస్తోందని చెబుతున్నారు. దీని ఇంజిన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అయితే ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా హైనెస్, సీబీ 350ఆర్ఎస్ బైక్ ల స్పెసిఫికేషన్లతోనే వస్తుందని చెబుతున్నారు. అంటే 350సీసీ, సింగిల్ సిలెండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 21 బీహెచ్పీ, 5,500ఆర్పీఎం ఉంటుంది. పీక్ టార్క్ అవుట్ పుట్ 3000 ఆర్పీఎం వద్ద 30ఎన్ఎం వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
View this post on Instagram
ప్రస్తుతం హై నెస్ సీబీ 350 బైక్ లో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. డీఎల్ఎక్స్, డీఎక్స్ ప్రో, క్రోమ్, లెగసీ ఎడిషన్. వీటి ధరలు రూ. 2.10లక్షలు, రూ. 2.16లక్షలు ఎక్స్ షోరూం ఉంటాయి. అలాగే సీబీ350ఆర్ఎస్ రెండు వేరియంట్లు ఉన్నాయి, డీఎల్ఎక్స్, కొత్త హ్యూ ఎడిషన్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ. 2.15లక్షలు, రూ. 2.19లక్షలు ఎక్స్ షోరూం ఉంటుంది.
ఈ హైనెస్ సీబీ350 అనే నియో రెట్రో మోటార్ సైకిల్. హోండా విక్రయించే యాక్సెసరీ కిట్ ను ఉపయోగించి దీనిని కస్టమైజ్ చేయొచ్చు. ఇప్పటికే సీబీ350ఆర్ ఎస్ బైక్లో స్యూడో స్క్రాబ్లర్ ఇది కూడా కేఫ్ రేసర్గా కస్టమైజ్డ్ కిట్ ఉపయోగించి మార్చుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..