Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayushman Bharat: కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం.. ఆయుష్మాన్ భారత్ కవరేజీ రెట్టింపు!

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులు, భవన నిర్మాణ కార్మికులు, బొగ్గు గని కార్మికులు, ఆశా వర్కర్లను చేర్చడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అత్యధిక ఖర్చుతో కూడున్న క్యాన్సర్ చికిత్సలు మొదలైన వాటికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన వస్తే ఈ రెట్టిపు బీమా సదుపాయం ఉపయోగపడనుంది..

Ayushman Bharat: కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం.. ఆయుష్మాన్ భారత్ కవరేజీ రెట్టింపు!
Ayushman Bharat
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2024 | 10:22 AM

క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు, ఎక్కువ ఖర్చుతో కూడిన వ్యాధుల చికిత్స విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తన ఫ్లాగ్‌షిప్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ కింద బీమా కవరేజీని రూ.10 లక్షలకు రెట్టింపు చేసే ప్రతిపాదనను ఖరారు చేసే పనిలో ఉందని అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులు, భవన నిర్మాణ కార్మికులు, బొగ్గు గని కార్మికులు, ఆశా వర్కర్లను చేర్చడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. అత్యధిక ఖర్చుతో కూడున్న క్యాన్సర్ చికిత్సలు మొదలైన వాటికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన వస్తే ఈ రెట్టిపు బీమా సదుపాయం ఉపయోగపడనుంది. ప్రస్తుతం బీమా కవరేజీ రూ.5 లక్షలు ఉండగా, దానిని రూ.10 లక్షలకు పెంచే ప్రతిపాదనను ఖరారు చేసేందుకు మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.

ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షల కవరేజీని పెంచడం, లబ్ధిదారుల సంఖ్యను 100 కోట్ల మందికి పెంచడం వల్ల ఏడాదికి రూ.12,076 కోట్ల అదనపు కేటాయింపులు జరుగుతాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పథకం 2018లో ప్రారంభించబడినప్పటి నుండి ఇప్పటి వరకు 6.2 కోట్ల మంది ఆస్పత్రిలో చికిత్స పొందగా, అందుకే రూ.79,157 కోట్ల కంటే ఎక్కువ ప్రభుత్వం చెల్లింపులు చేసినట్లు మంత్రిత్వ శాఖ చెబుతోంది. లబ్ధిదారుడు AB PM-JAY పరిధికి వెలుపల సొంతంగా అదే చికిత్సను పొందినట్లయితే, మొత్తం ఖర్చు చికిత్స దాదాపు రెండు రెట్లు పెరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ కోసం కేటాయించిన బడ్జెట్ రూ. 7,200 కోట్లు. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 15,000 కోట్లకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం అందిస్తోంది కేంద్రం. కేన్సర్‌ చికిత్స, అవయవ మార్పిడి తదితరాలకు మరింత వ్యయం అవుతున్న నేపథ్యంలో 2024-25 సంవత్సరం నుంచి ఈ కార్డుపై ఆరోగ్య బీమా కవరేజీని రెట్టింపు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి