Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: థాలినోమిక్స్ అంటే ఏమిటి? ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుంది?

ఆర్థిక సర్వేను ప్రజలకు వివరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. దీని సహాయంతో సాధారణ పౌరులు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం థాలినోమిక్స్ ద్వారా ప్రజలకు వివరిస్తుంది. ఇప్పుడు మీరు థాలినోమిక్స్ అంటే ఏమిటి ?అని ఆశ్చర్యపోతున్నారు. అందుకే మీకు థాలినోమిక్స్ గురించి, దాని ద్వారా ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకుందాం..

Budget 2024: థాలినోమిక్స్ అంటే ఏమిటి? ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని ఎలా నిర్ణయిస్తుంది?
Thalinomics
Follow us
Subhash Goud

|

Updated on: Jan 18, 2024 | 7:50 AM

దేశ బడ్జెట్ రావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కానీ చాలా మందికి ఆర్థిక సర్వే అర్థం కాదు. ఆర్థిక సర్వే నివేదికను సామాన్యులు అర్థం చేసుకోకుండా విస్మరించడానికి కారణం ఇదే. అయితే ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం నిర్ణయించే కొలమానం ఇది. ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. తదనుగుణంగా దేశ ఆర్థిక సర్వే జనవరి 31న సమర్పిస్తున్నారు.

ఆర్థిక సర్వేను ప్రజలకు వివరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. దీని సహాయంతో సాధారణ పౌరులు ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం థాలినోమిక్స్ ద్వారా ప్రజలకు వివరిస్తుంది. ఇప్పుడు మీరు థాలినోమిక్స్ అంటే ఏమిటి ?అని ఆశ్చర్యపోతున్నారు. అందుకే మీకు థాలినోమిక్స్ గురించి, దాని ద్వారా ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకుందాం.

థాలినోమిక్స్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

థాలినోమిక్స్ అనేది భారతదేశంలో ఆహార స్థోమత గురించి తెలిసిన ఒక పద్ధతి. అంటే ఒక ప్లేట్ ఆహారం తినడానికి భారతీయుడు ఎంత ఖర్చు చేస్తున్నాడో థాలినోమిక్స్ ద్వారా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికీ ఆహారం ప్రాథమిక అవసరం. తినడం, తాగడం సాధారణ ప్రజలను ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. థాలీనోమిక్స్ అనేది ఒక సగటు వ్యక్తి థాలీకి ఎంత చెల్లిస్తారో కొలిచే ప్రయత్నం. దేశంలో ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో ఇది నిర్ణయిస్తుంది.

థాలీ ధరలు ఎలా నిర్ణయిస్తారు?

వెజ్, నాన్ వెజ్ థాలీ ధరల గురించి ఆర్థిక సర్వేలో సమాచారం ఇస్తుంది. ఏ ప్లేటు ఆహారం ఖరీదైంది, ఏ ప్లేట్ ఆహారం చౌకగా మారింది.. భారతదేశంలో ఒక ప్లేట్ ఫుడ్ ఆర్థికశాస్త్రంపై ఆధారపడిన సమీక్షలో పోషకమైన ప్లేట్ ధరల ఆధారంగా తీర్మానాలు తీసుకుంటుంది ఆర్థిక శాఖ. ఈ అర్థశాస్త్రం ద్వారా భారతదేశంలో ఒక సాధారణ వ్యక్తి ఒక ప్లేట్ కోసం చేసే ఖర్చును అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి