- Telugu News Photo Gallery Business photos Food how is genuine basmati rice identified india earns this much every year by exporting
Basmati Rice: ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా బాస్మతి.. ఎలా గుర్తిస్తారు?
స్మతి బియ్యం ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా ఎంపికైంది. ఈ జాబితాలో ఇటలీకి చెందిన అర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో నిలిచారు. పులావ్ నుండి బిర్యానీ వరకు భారతదేశంలోని ప్రతి వ్యక్తి మొదటి ఎంపిక బాస్మతి బియ్యం. ఇది భారతదేశం కాకుండా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పండిస్తుంటారు. బాస్మతి బియ్యం అనేది భారత్‌కు పెట్టింది పేరు. అయితే, బాస్మతి బియ్యాన్ని అత్యధికంగా..
Updated on: Jan 17, 2024 | 11:21 AM

బాస్మతి బియ్యం.. ఈ పేరు తెలియనివారంటూ ఉండరు. ఎందుకంటే బిర్యానీ అద్భుతంగా కావాలంటే అది బాస్మతి బియ్యానికే సాధ్యం. ఈ బియ్యంతో రకరకాల బిర్యానీ వంటకాలు చేసుకోవచ్చు. బిర్యానీకి ఉన్న పేరే వేరు. బిర్యానీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే బాస్మతి బియ్యం. ఏదైనా బిర్యానీ గానీ, పులావ్ గానీ చేయాలంటే మామూలు బియ్యానికంటే బిస్మతి బియ్యంతోనే అద్భుంగా వస్తుంది. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.

బాస్మతి బియ్యాన్ని ఎటువంటి కారణం లేకుండా బెస్ట్ రైస్ అని పిలవరు. దాని వాసన, రుచి చూసే ఆకర్షితులవుతారు. ఇది ఇప్పుడు ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన తాజా నివేదిక ద్వారా రుజువు అవుతోంది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ 2023-24 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యం జాబితాను విడుదల చేసింది.

ఇందులో బాస్మతి బియ్యం ప్రపంచంలోనే అత్యుత్తమ బియ్యంగా ఎంపికైంది. ఈ జాబితాలో ఇటలీకి చెందిన అర్బోరియో రెండో స్థానంలో, పోర్చుగల్‌కు చెందిన కరోలినా రైస్ మూడో స్థానంలో నిలిచారు. పులావ్ నుండి బిర్యానీ వరకు భారతదేశంలోని ప్రతి వ్యక్తి మొదటి ఎంపిక బాస్మతి బియ్యం. ఇది భారతదేశం కాకుండా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పండిస్తుంటారు. బాస్మతి బియ్యం అనేది భారత్‌కు పెట్టింది పేరు.

అయితే, బాస్మతి బియ్యాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతదేశం. ఇది ప్రతి సంవత్సరం 6.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతి చేస్తుంది. అలాగే దీని ద్వారా పాకిస్థాన్ 2.2 బిలియన్ డాలర్లను ఆర్జించింది.

అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రకారం, 6.61 మిమీ పొడవు, 2 మిమీ మందం ఉన్న బియ్యాన్ని బాస్మతిగా వర్గీకరిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతదేశంలోని రాష్ట్రాల ఆధారంగా కూడా దీనికి పేరు పెట్టారు. ఉదాహరణకు డెహ్రాడూన్‌లో పండించే ఈ ప్రత్యేక బియ్యాన్ని డెహ్రాడూన్ బాస్మత్ అంటారు.





























