Gold Reserves: అత్యధిక బంగారు నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు.. భారత్ ఎన్నోస్థానం అంటే..
ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. బంగారం అనేది పెట్టుబడులో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయాల్లో విశ్వసనీయమైన విలువ నిల్వగా పనిచేస్తాయి. ఫోర్బ్స్ ప్రకారం, దేశాలు తమ కరెన్సీ, నిర్దిష్ట పరిమాణంలో బంగారం మధ్య స్థిరమైన మారకపు రేటును నిర్ణయించడం ద్వారా తమ కాగితం కరెన్సీ విలువను బంగారంతో..
బంగారం.. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక స్థానం ఉంది. పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఏ సీజన్‌లో అయినా బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వినియోగదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. బంగారం అనేది పెట్టుబడులో కీలక పాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయాల్లో విశ్వసనీయమైన విలువ నిల్వగా పనిచేస్తాయి. ఫోర్బ్స్ ప్రకారం, దేశాలు తమ కరెన్సీ, నిర్దిష్ట పరిమాణంలో బంగారం మధ్య స్థిరమైన మారకపు రేటును నిర్ణయించడం ద్వారా తమ కాగితం కరెన్సీ విలువను బంగారంతో ముడిపెట్టాయి . ముఖ్యంగా జారీ చేసిన ప్రతి యూనిట్ కరెన్సీ బంగారంలో సమానమైన విలువను కలిగి ఉంది.
వ్యక్తులు తమ డబ్బును ఈ స్థిరమైన రేటుతో స్వచ్ఛమైన బంగారంతో మార్పిడి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నిల్వలకు డిమాండ్ పెరుగుతోంది. సెంట్రల్ బ్యాంకులు మరోసారి బంగారానికి ప్రాథమిక సురక్షిత ఆస్తిగా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఆధునిక ఆర్థిక రంగం మారుతున్నప్పటికీ, బంగారం నిల్వలు దేశం క్రెడిట్‌ను, మొత్తం ఆర్థిక స్థితిని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన టాప్ 10 దేశాల జాబితా:
- మొదటి స్థానంలో USA ప్రపంచంలో అత్యధికంగా 8,1336.46 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి.
- రెండో స్థానంలో జర్మనీ ఉంది. ఇక్కడ 3,352.65 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
- మూడో స్థానంలో ఇటలీ ఉంది. ఇక్కడ 2,451.84 టన్నుల బంగారం నిల్వలున్నాయి.
- నాలుగో స్థానంలో ఫ్రాన్స్. ఇక్కడ 2,436.88 టన్నుల బంగారం నిల్వల ఉన్నాయి.
- ఐదో స్థానంలో రష్యా. ఇక్కడ 2,332.74 టన్నుల బంగారం నిల్వలు.
- ఆరో స్థానంలో చైనా ఉంది. ఇక్కడ 2,191.53 టన్నుల బంగారం నిల్వలు
- ఏడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఇక్కడ 1,040.00 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి
- ఎనిమిదో స్థానంలో జపాన్. ఇక్కడ 845.97 టన్నుల బంగారం నిల్వలు.
- ఇక తొమ్మిదవ స్థానంలో భారత్ ఉంది. మన దేశంలో 800.78 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
- ఇక చివరగా పదో స్థానంలో నెదర్లాండ్స్. ఇక్కడ 612.45 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.
దేశాలు బంగారం నిల్వలను నిర్వహించడానికి ఒకటి కాదు, అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదట బంగారం ఒక స్థిరమైన, ఆధారపడే విలువ గల స్టోర్‌గా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో బంగారాన్ని నిల్వ చేయడం ద్వారా దేశాలు తమ ఆర్థిక స్థిరత్వంపై విశ్వాసాన్ని కలిగిస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి