AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ఓ 3.0పై కీలక ప్రకటన

భారతదేశంలోని ఉద్యోగులకు పీఎఫ్ ప్రత్యేేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పించేందుకు ఈపీఎఫ్ఓ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే తాజాగా ఈపీఎఫ్ఓ గురించి కేంద్రం కీలక ప్రకటన చేసింది.

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ఓ 3.0పై కీలక ప్రకటన
Nikhil
|

Updated on: Jan 03, 2025 | 4:45 PM

Share

ఈపీఎఫ్ఓ చందాదారులకు కోసం ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మొబైల్ అప్లికేషన్, డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల విలేకరులకు తెలిపారు. ఈపీఎఫ్ఓ 3.0 కోసం ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ 2.0 ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈపీఎఫ్ఓ 3.0 యాప్ మే-జూన్ నాటికి ప్రారంభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా చందాదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చని, ముఖ్యంగా విత్‌డ్రా చేసుకోవడం మరింత సులువు అవుతుందని పేర్కొన్నారు. ఈ సౌకర్యాలను వినియోగదారులకు అందబాటులోకి తెచ్చేందుకు ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయిత ఇకపై చందాదారులు డెబిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ నిధులను విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది. 

ఏటీఎం కార్డు అందించినంత మాత్రన చందాదారులు తమ మొత్తం కంట్రిబ్యూషన్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు యాక్సెస్ ఉండదు. పీఎఫ్ ఖాతాలోని నగదు నిలువ ఆధారంగా ఉపసంహరణ పరిమితిని ఏర్పాటు చేస్తారు. పరిమితిలోపు ఉపసంహరణలకు గతంలో మాదిరిగానే ఈపీఎఫ్ఓ నుంచి ముందస్తు అనుమతి అవసరం ఉండదు. ముఖ్యంగా ఎలాంటి ఫారమ్స్ నింపే అవకాశం లేకుండా, అలాగే పీఎఫ్ ఆఫీస్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా పీఎఫ్‌ ఖాతాలోని సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు

అలాగే ఉపాధి అవకాశాల విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఉపాధి అవకాశాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించిందని, 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో 17.19 కోట్ల మందికి ఉపాధి లభించిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి గణాంకాలతో పోలిస్తే ఈ సంఖ్య ఆరు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్క 2023-2024 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 4.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఉపాధి 16 శాతం తగ్గిందని పేర్కొన్నారు. అయితే ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ ఉపాధి 2014 నుంచి 2023 మధ్య 19 శాతం పెరిగిందని స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి