AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: దేశీయ విమానాల్లోనూ వైఫై సేవలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా

దేశీయ, అంతర్జాతీయంగా సేవలు అందిస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు ఎన్నో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. వారి అవసరాలకు అనుగుణంగా వాటిని విస్తరించుకుంటూ పోతోంది. వాటిలో భాగంగా వైఫై ఇంటర్నెట్ సర్వీసులకు నాంది పలికింది. దేశీయ, విదేశీ విమాన సర్వీసుల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

Air India: దేశీయ విమానాల్లోనూ వైఫై సేవలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా
Air India
Nikhil
|

Updated on: Jan 03, 2025 | 4:30 PM

Share

ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9తో పాటు ఎంపిక చేసిన ఏ321 విమానాల్లో  వైఫై సేవలు లభిస్తాయి. దేశీయంగా ఇలాంటి సేవలందిస్తున్న తొలి విమానాయాన సంస్థగా ఎయిర్ ఇండియా రికార్డు నెలకొల్పింది. విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత సుమారు పదివేల అడుగులు ఎత్తు దాటాక వైఫై ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు తమ ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లకు వైఫైను కనెక్ట్ చేసుకోవచ్చు. వాటి ద్వాారా ప్రయాణంలోనే తమ పనులను నిర్వహించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరికీ ఎయిర్ ఇండియా ఉచితంగా అందజేస్తోంది.

ఎయిర్ ఇండియాకు చెందిన అంతర్జాతీయ రూట్లలో గతంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను మొదలు పెట్టారు. న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ తదితర మార్గాల్లో నడిచే ఎయర్ బస్ ఏ350, ఎయిర్ బస్ ఏ321 నియో, బోయింగ్ బీ787-9 విమానాల్లో అందజేస్తున్నారు. వాటికి కొనసాగింపుగా దేశీయ విమానాలకు ఈ సేవలను తీసుకువచ్చారు. టాాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ తీసుకువచ్చిన ఈ సేవలు ప్రయాణికులకు చాలా ఉపయోగంగా ఉంటున్నాయి. ఈ గ్రూపులో దాదాపు 300 విమానాలు ఉన్నాయి. దీనిలో ఎయిర్ ఇండియాతో పాటు తక్కువ చార్జీలతో నడిచే దాని అనుబంధ ఎయిర్ లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. గత అక్టోబర్ లో ఏఐఎక్స్ కనెక్ట్, ఆ తర్వాత విస్తారా సంస్థలు ఎయిర్ ఇండియాలో విలీనమయ్యాయి.

కొన్ని రకాల ఆర్టీస బస్సులు, మెట్రో రైళ్లు తదితర వాటిలో ఉచిత వైఫై సర్వీసులను ప్రయాణికులకు అందించడం ఇప్పటి వరకూ తెలిసిందే. ప్రయాణ సమయంలో వాటిని ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు గాలిలో ప్రయాణించే సమయంలోనూ ఈ సేవలను అందుబాటులోకి రావడం గమనార్హం. అంతర్జాతీయ రూట్లలో అందిస్తున్న ఈ సేవలను దేశీయంగాను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చింది. విమాన ప్రయాణికులకు వైఫై సేవలను రెండు రకాలుగా అందిస్తారు. ఒకటి ఎయిర్ టు గ్రౌండ్, రెండోది శాటిలైట్ వైఫై. మొదటి పద్ధతి నేలపై ఉండే ఇంటర్నెట్ లాంటింది. సెల్ టవర్ల్ ద్వారా ఆకాశంలోకి సిగ్నల్స్ పంపుతారు. రెండో విధానంలో విమానాలకు యాంటీనా అమర్చుతారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుతాయి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. చాలా విమానాయన సంస్థలు దీన్ని అమలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్