Budget 2025: మంత్రి నిర్మలమ్మ పూర్తి స్థాయి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు? అంచనాలు ఏంటి?
Budget 2025: మూడు సారి మోడీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు పూర్థి స్థాయిలో యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికలకు ముందు మధ్యంత బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఇప్పుడు పూర్త స్థాయిలో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరి బడ్జెట్ సమర్పణ ఎప్పుడు.. సమయ వేళలు ఏంటో తెలుసుకుందాం..
ఇటీవలి సంవత్సరాల సంప్రదాయాన్ని అనుసరించి ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్ 2025 పార్లమెంట్‌లో సమర్పించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ 3.0 ప్రభుత్వం రెండవ పూర్తి స్థాయి బడ్జెట్‌ను వచ్చే నెల మొదటి తేదీన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. యూనియన్ బడ్జెట్ 2025 ప్రకటన భారతీయ స్టాక్ మార్కెట్ (BSE, NSE) ఫిబ్రవరి 1న శనివారం అయినప్పటికీ తెరిచి ఉంటుంది .యూనియన్ బడ్జెట్ సమర్పణ కారణంగా, ఎక్స్ఛేంజ్ ఫిబ్రవరి 1, 2025న ప్రత్యక్ష ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తుందని ఎక్స్ఛేంజీలు సర్క్యులర్‌లో పేర్కొన్నాయి. అన్ని శని, ఆదివారాల్లో భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు సాధారణంగా మూసి ఉంటాయి. గతంలో శనివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి.
బడ్జెట్ 2025: తేదీ, సమయం:
ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ 2025ను సమర్పించే అవకాశం ఉంది. ఇది ఆరు వార్షిక, రెండు మధ్యంతర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మంత్రి.. ఇప్పుడు మరోసారి బడ్జెట్ సమర్పించనుంది.
ఆదాయపు పన్ను బడ్జెట్ 2025 అంచనాలు:
యూనియన్ బడ్జెట్ 2025 సమీపిస్తున్న కొద్దీ, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం జీతాలు తీసుకునే వ్యక్తులలో అంచనాలు పెరుగుతున్నాయి. వార్షిక బడ్జెట్ ఆధారిత పన్ను మార్పులు తరచుగా దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికకు అంతరాయం కలిగిస్తాయని టాక్స్‌పానర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సుధీర్ కౌశిక్ పేర్కొన్నారు. పొదుపు చేయని వారి కోసం ఖర్చును ప్రోత్సహించడానికి కొత్త పన్ను విధానం రూపొందించబడినప్పటికీ, పొదుపుపై దృష్టి సారించిన పన్ను చెల్లింపుదారులు కూడా వారి ప్రస్తుత ప్రణాళికలను కొనసాగించడానికి అనుమతించడం చాలా కీలకమన్నారు. భవిష్యత్ ఆర్థిక బాధ్యతలను పరిష్కరించేందుకు పన్ను చెల్లింపుదారులు, వారి సలహాదారులు తమ అవసరాలకు సరిపోయే విధానాన్ని ఎంచుకోవాలన్నారు. లేకుంటే పన్ను విధానం ఈ ఎంపికను బలహీనపరుస్తుందని, మరింత ప్రజాస్వామ్య విధానం పన్ను చెల్లింపుదారులు తమకు ఏది ఉత్తమమో నిర్ణయించుకోవడానికి అనుమతిస్తుందన్నారు.
మంత్రి నిర్మలమ్మ ప్రసంగం ఎక్కడ చూడాలి?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంటు అధికారిక ఛానెల్‌లైన దూరదర్శన్, సంసద్ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. పార్లమెంట్ సంసద్ టీవీ, దూరదర్శన్ యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా లైవ్ బడ్జెట్ 2025 ప్రోగ్రామ్‌ను ప్రసారం చేస్తాయి.
బడ్జెట్ 2025 పత్రాలను ఎక్కడ చదవాలి:
మధ్యంతర బడ్జెట్ 2025 “పేపర్‌లెస్ ఫారమ్” యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది. యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.indiabudget.gov.in) లేదా Android, iOS వినియోగదారులు multilingual appని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది హిందీ, ఆంగ్లంలో అందుబాటులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: PM Office: ప్రధాని కార్యాలయంలో వంట చేసేవారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం ఎంతో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి