Gold Prices Today Fall: ఆల్ టైం హై నుంచి దిగి వస్తున్న పసిడి ధరలు.. గత 6 రోజుల్లో 5వ సారి రికార్డ్ స్థాయిలో ఎన్ని వేలు తగ్గిందో తెలుసా..!
కరోనా సమయంలో గత ఏడాదిలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆల్ టైం హై కి వెళ్లాయి. నిన్నా మొన్నటి వరకూ చుక్కలనంటిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గతంలో 56 వేల మార్కును తాకిన 10 గ్రాముల పసిడి ధర... ప్రస్తుతం 48 వేల దిగువకు..
Gold Prices Today Fall: కరోనా సమయంలో గత ఏడాదిలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఆల్ టైం హై కి వెళ్లాయి. నిన్నా మొన్నటి వరకూ చుక్కలనంటిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గతంలో 56 వేల మార్కును తాకిన 10 గ్రాముల పసిడి ధర… ప్రస్తుతం 48 వేల దిగువకు చేరుకుంది. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశంలో పసిడి , వెండి ధరలు వరసగా ఆరో రోజు దిగివచ్చాయి. రికార్డ్ స్థాయిలో రూ. 9000 తగ్గింది. ఈరోజు ఆరు సెషన్లలో ఐదో సారి బంగారం ధర పతనమయ్యింది. బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాముకు 0.12% పడిపోయి,రూ. 47,200 కు చేరుకుంది. ఇక మరో వైపు వెండి ధర కూడా ఫ్యూచర్స్ 0.2% తగ్గి కేజీ వెండి రూ. 68.593 లకు చేరుకుంది.
గత ఏడాది ఆగస్థులో పసిడి ధర రూ. 56,200 లకు ఆల్ టైం హై కి చేరుకున్న తర్వాత .. నెమ్మదిగా దిగి వస్తున్నాయి. అసలు బంగారం ధరలు ఆ రేంజ్ లో పెరగడానికి కారణం అంతర్జాతీయంగా ఏర్పాడిన పరిణామాలతో పాటు డాలర్ తో రూపాయి మారకం విలువ బంగారం ధరలపై ప్రభావం చూపాయి. అయితే ఇటీవలి బడ్జెట్‌లో భారత ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గించడం కూడా దేశీయ బంగారం ధరపై ప్రభావం చూపింది. దిగుమతి సుంకం తగ్గించిన తరువాత, దేశీయ బంగారం ధరలు తగ్గాయని .. డాలర్ సూచీ పెరగడం తో పాటు యుఎస్ దిగుబడి కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధర క్షీణించినట్లు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ క్షతీజ్ పురోహిత్ చెప్పారు.
గ్లోబల్ మార్కెట్లలో, ఈక్విటీలు గరిష్ట స్థాయికి పెరగడంతో బంగారం ధర ఔన్స్ $1,811.80 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు ఆసియా మార్కెట్లు స్థిరంగా ఉండడంతో పాటు శుక్రవారం రికార్డును నమోదు చేయడంతో ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ ఫ్యూచర్స్ పెరిగింది. గత వారంలో బంగారం ధర కొంచెం తగ్గింది. అయితే యుఎస్ లో డాలర్ రేటు.. అంతర్జాతీయంగా బంగారం ధరపై.. ఆ ప్రభావం దేశీయంగా భారీ ప్రభావం చూపిస్తుందని.. క్షితిజ్ పురోహిత్ అన్నారు.
అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించడంతో పాటు.. అక్కడ కరోనా వైరస్ పరిస్థితిని మెరుగు పరచడానికి తీసుకుంటున్న చర్యలు కూడా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఏర్పడానికి ఓ కారణమని కోటక్ సెక్యూరిటీస్ వెల్లడించింది.
ప్రస్తుతం జో రిలీజ్ చేసిన ఈ అమెరికన్ రిలీఫ్ ప్యాకేజీ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోందని.. స్థిరాస్తి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కొంతమంది మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పరిస్థితులు బంగారం ధరపై భారీ ప్రభావాన్ని చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని తాజా పరిస్థితులు ద్రవ్యోల్బణానికి.. కరెన్సీ క్షీణతకు కారణం అయితే.. అందరి చూపు బంగారం వైపే ఉంటుందని.. బంగారం ప్రత్యాన్మాయ మార్గంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: