ఈజీ మనీ కోసం ఆశపడ్డాడు.. లైవ్ స్ట్రీమింగ్‌లో ఏకంగా 1.5 లీటర్ల వోడ్కా తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
Russian Man Drinks Vodka: ఈజీ మనీ కోసం ఆశపడిన ఓ ప్రబుద్దుడు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఏకంగా 1.5 లీటర్ల వోడ్కాను తాగేశాడు. ఇక తీరా చూస్తే ఆ తర్వాత..
Russian Man Drinks Vodka: ఈజీ మనీ కోసం ఆశపడిన ఓ 60 ఏళ్ల వృద్దుడు.. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌లో తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన చూసి నెటిజన్లు అందరూ షాక్ కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. వివరాలు ఇలా ఉన్నాయి.
రష్యన్ న్యూస్ రిపోర్ట్స్ ఇచ్చిన ఆధారాల ప్రకారం ఓ యూట్యూబర్ లైవ్‌లో వోడ్కా లేదా హాట్ సాస్ తాగితే రివార్డుగా పెద్ద మొత్తంలో డబ్బులిస్తానని ప్రకటించాడు. దీనికి ఎలాంటి వయసు నిబంధనలు లేవని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే యువకలతో పాటు ‘గ్రాండ్‌పా’గా పేరుగాంచిన 60 ఏళ్ల యూరి దుషేచికిన్ కూడా పాల్గొన్నాడు.
పోటీలో పాల్గొన్న వృద్దుడు లైవ్ స్ట్రీమింగ్‌లో ఏకంగా 1.5 లీటర్ల వోడ్కాను సేవించాడు. ఆ తర్వాత లైవ్‌లోనే కుప్పకూలిపోయాడు. అనంతరం అతడిని పరిశీలిస్తే చనిపోయాడని తెలిసింది. లైవ్‌లో వృద్దుడు మరణించడం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా, ‘ఫస్ట్ స్టెప్ ఆన్ యూట్యూబ్’ అనే యూట్యూబ్ ఛానల్ కలిగిన జహెక ఈ కాంటెస్ట్‌ను పెట్టినట్లు తెలుస్తోంది. పేదవారి కోసం అతడు ఇలాంటి వీడియోస్ గతంలో కూడా చేశాడని సమాచారం.
ఇది కూడా చదవండి:
India Vs England 1st Test Day 4: రసవత్తరంగా మారిన తొలి టెస్టు.. నాలుగో రోజు పైచేయి సాధించేది ఎవరు.?