Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inmates at St. Louis jail Set Fire: కరోనా నివారణ కోసం అధికారుల కట్టడి.. అసహనంతో జైల్లో బీభత్సం సృష్టించిన ఖైదీలు

కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు కట్టడి చర్యలు చేపట్టాయి. దీంతో జైల్లో ఉన్న ఖైదీలను చూడడానికి వచ్చే బంధువులను సైతం పరిమితంగానే అనుమతిస్తున్నారు. ఇక మరోవైపు కోర్టులో కేసుల విచారణను నిలిపేశారు. దీంతో ఖైదీల్లో అసహనం..

Inmates at St. Louis jail Set Fire:  కరోనా నివారణ కోసం అధికారుల కట్టడి.. అసహనంతో జైల్లో  బీభత్సం సృష్టించిన ఖైదీలు
Follow us
Surya Kala

|

Updated on: Feb 08, 2021 | 2:21 PM

Inmates at St. Louis jail Set Fire: కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు కట్టడి చర్యలు చేపట్టాయి. దీంతో జైల్లో ఉన్న ఖైదీలను చూడడానికి వచ్చే బంధువులను సైతం పరిమితంగానే అనుమతిస్తున్నారు. ఇక మరోవైపు కోర్టులో కేసుల విచారణను నిలిపేశారు. దీంతో ఖైదీల్లో అసహనం పెరిగిపోయింది. జైల్లో నానాభీభత్సం సృష్టించారు. ఈ ఘటన అమెరికాలోని యింట్‌ లూయిస్‌ జైల్లో ఖైదీల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…

శనివారం తెల్లవారుజామున ఖైదీలు బీభత్సం సృష్టించారు.జైలు అధికారులతో ఘర్షణకు దిగారు. జైలు నాలుగో అంతస్తులో కిటికీలను, పైప్‌లను ధ్వంసం చేశారు. కుర్చీలు, మంచాలు, పరుపులకు నిప్పు పెట్టారు. ఖైదీలను అధికారులు ఎంతో కష్టపడి శాంతింపజేశారు. చివరకు ఉదయం 10 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అర్పివేశారు. ఈ జైల్లో 633 మంది ఖైదీలు ఉంటారని.. వారిలో దాదాపు 115 మంది బీభత్సం సృష్టించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఘటనలో ఖైదీలెవరూ గాయపడలేదు. ఓ అధికారి స్వల్పంగా గాయపడగా, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. సెయింట్‌ లూయిస్‌ జైలు నుంచి 65 మంది ఖైదీలను డౌన్‌టౌన్‌ జైలుకు తరలించారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై అదనపు చర్యలు తీసుకోనున్నామని అధికారులు తెలిపారు.

Also Read:

కరోనా మూలాలు వెలికి తీసేందుకు వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో (WHO) బృందం పర్యటన.. కీలక ఆధారాలు లభ్యం..!

భారత్ వ్యాక్సిన్ చేయూత.. బార్బడోస్, డొమినికా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు..

దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
దిగొస్తున్న బంగారం ధర.. త్వరలో తులం రూ. 56వేలు వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
లోకల్​ Vs నాన్​ లోకల్ ఫైట్..కోతుల గుంపుల భీకర యుద్ధం వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
ఏఐతో మానవాళికి తప్పని ముప్పు.. గూగుల్‌ వార్నింగ్‌ వీడియో
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
టఫ్ ఫైట్ లో బరిలోకి దిగిన సిద్దు.. జాక్ హిట్ కొట్టాడా ??
ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..
ఎనిమిది సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా పడలేదు..
Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం...
Viral Video: ఇద్దరు పిల్లలు పుట్టినంక ప్రియుడితో భార్య యవ్వారం...
అమ్మవారికి నైవేద్యంగా, భక్తులకు ప్రసాదంగా చైనీస్ వంటలు.. ఎందుకంటే
అమ్మవారికి నైవేద్యంగా, భక్తులకు ప్రసాదంగా చైనీస్ వంటలు.. ఎందుకంటే
ఇదో వంద పడకల ఆస్పత్రి..! కానీ, లోపలికి వెళ్లి చూస్తే మాత్రం..!
ఇదో వంద పడకల ఆస్పత్రి..! కానీ, లోపలికి వెళ్లి చూస్తే మాత్రం..!
స్టార్ హీరోయిన్స్ ముద్దు పేర్లు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
స్టార్ హీరోయిన్స్ ముద్దు పేర్లు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?