Covid Vaccine: భారత్ వ్యాక్సిన్ చేయూత.. బార్బడోస్, డొమినికా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు..

India dispatches Covid-19 vaccines: కరోనావైరస్‌తో చిగుటాకులా వణికిపోతున్న దేశాలకు భారత్ బాసటగా నిలుస్తోంది. తాజాగా భారత్ టీకా పంపిణీ విషయంలో మరో రెండు దేశాలకు సాయమందించి..

Covid Vaccine: భారత్ వ్యాక్సిన్ చేయూత.. బార్బడోస్, డొమినికా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ డోసులు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 08, 2021 | 9:56 AM

India dispatches Covid-19 vaccines: కరోనావైరస్‌తో చిగుటాకులా వణికిపోతున్న దేశాలకు భారత్ బాసటగా నిలుస్తోంది. తాజాగా భారత్ టీకా పంపిణీ విషయంలో మరో రెండు దేశాలకు సాయమందించి ఉదారత చాటుకుంది. కరీబియన్‌ దేశాలైన బార్బడోస్‌, డొమినికా దేశాలకు భారత్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పంపింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్‌ డోసులను ఆయా దేశాలకు ఆదివారం సరఫరా చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ల డోసులను నిన్న రాత్రి 11:35 గంటలకు మహారాష్ట్రలోని ముంబై నుంచి ప్రత్యేక విమానంలో తరలించారు. ఈ మేరకు బార్బడోస్ దేశ ప్రధాని మియా మోట్లీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. భారత్ తమ పట్ల చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖలో వివరించారు.

ఇప్పటికే చాలా దేశాలకు భారత్ కోవిడ్ డోసులను సరఫరా చేసి అందరిమన్ననలు పొందుతోంది. దీనిలో భాగంగా కరేబీయన్ దేశాలకు కూడా సరఫరా చేసింది. ఇదిలాఉంటే.. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేసిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం నిన్న వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక టీకా డోసులు ఇచ్చిన దేశమైందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

Also Read:

ప్రజలకు వ్యాక్సిన్లు ఇ చ్చిన దేశాల్లో ఇండియాకు మూడో స్థానం, కేంద్రం వెల్లడి. త్వరలో మళ్ళీ రెండో డోసు

COVID-19 Vaccine: 24 గంటల్లో 1,93,187 మందికి కరోనా టీకా.. ఇప్పటి వరకు కరోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 4.2 మిలియన్లు

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు