బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్లు పేలి ఏడు ఇళ్లు ధ్వంసం.. నలుగురు దుర్మరణం..
gas cylinders Explosion: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు దుర్మరణం చెందారు. బ్రెజిల్ దేశంలోని రియో గ్రాండీ డో నోర్టీ..
gas cylinders Explosion: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్లు పేలి నలుగురు దుర్మరణం చెందారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన బ్రెజిల్ దేశంలోని రియో గ్రాండీ డో నోర్టీ రాష్ట్రంలోని నాటల్ నగరంలో చోటుచేసుకుంది. నాటల్‌లో గ్యాస్ సిలిండర్లు పేలి.. ఏడు ఇళ్లు భీకరంగా ధ్వంసమయ్యాయి. దీంతోపాటు ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించారని.. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బ్రెజిల్ నాటల్ పోలీసులు తెలిపారు. వెంటనే బ్రెజిల్ మిలటరీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.
Also Read: