ఇళ్లు విడిచిన వ్యక్తి 23 ఏళ్లకు తిరిగి చేరుకున్నాడు.. ఇంతకాలం అతడు ఎక్కక ఉన్నాడబ్బా…!
ఇరవై మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌లో అక్కడి పోలీసులకు చిక్కి, అప్పటి నుంచి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ ఎట్టకేలకు విడదలయ్యారు.
ఇరవై మూడేళ్ల క్రితం పాకిస్తాన్‌లో అక్కడి పోలీసులకు చిక్కి, అప్పటి నుంచి పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీ ఎట్టకేలకు విడదలయ్యారు. మతిస్థిమితం కోల్పోయిన ఓ గిరిజన వ్యక్తి పాకిస్తాన్ చేరుకున్నాడు. ఎలాంటి వీసా పత్రాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడకు వెళ్లిన అతడిని పాక్ పోలీసులు గూఢచర్యం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. విచారణ కూడా జరకుండానే జైలులో పడేశారు. ఇరు దేశాలకు చెందిన అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇంతకాలం నేర చేయకుండానే జైలుశిక్ష అనుభవించాడు. ఎట్టకేలకు కుటుంబసభ్యుల చొరవతో విడుదలై స్వదేశానికి చేరుకున్నాడు.
ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం జంగతోలి. ఓ 27 ఏళ్ల బిర్జూ కుల్లూ మతిస్దిమితం లేని గిరిజనుడు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి పాకిస్తాన్ సరిహద్దులకు చేరుకున్నాడు. అక్కడ పాక్ రేంజర్లు పట్టుకుని నిర్బంధించారు. గూడఛర్యం చేస్తున్నట్లు ఆనవాళ్లు లేకపోయినా అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అరెస్టు చేసి జైల్లో వేశారు. దర్యాప్తులో ఏమీ నిర్ధారణ కాలేదు. అలాగని వదిలిపెట్టలేరు. ఏం చేయాలో తెలియక అనుమానాస్పద కేసుగా జైల్లో వేశారు. బిర్జూ కుల్లూను నిర్బంధించిన పాక్ అధికారులు పలుమార్లు విచారణ జరిపినా వదిలిపెట్టలేదు. అలా 23 ఏళ్లపాటు లాహోర్ జైల్లోనే మరో 20 మంది భారతీయ ఖైదీలతో కలిసి కుల్లూ ఉండిపోయాడు.చివరికి 23 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు ఆయన తాజాగా ఇంటికి చేరాడు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన బిర్జూ తప్పిపోయినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు స్ధానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. మతిస్ధిమితం లేకపోవడం, దొరుకుతాడన్న ఆశ కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా వెతికి వెతికి విసిగిపోయారు. ఇక ఫలితం లేదని భావించి ఆయన్ను వదిలేశారు. చివరికి మతిస్ధిమితం లేని కొడుకు కోసం వెతికి వెతికి తల్లితండ్రులు కూడా ఆవేదనతో కన్నుమూశారు. ఉన్న ఒక్కగానొక్క సోదరి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దగ్గరి బంధువులు కూడా ఏం చేయలేక వదిలేశారు.
జీవితఖైదు అనుభవిస్తూ జైల్లోనే ఉండిపోయిన కుల్లూ గురించిన సమాచారం ఎలాగోలా భారత అధికారులకు లభించడం, కుల్లూపై తీవ్ర అభియోగాలేవీ నమోదు కాకపోవడం వంటి కారణాలతో పాకిస్తాన్ అధికారులు సానుకూలంగా వ్యవహరించారు. దీంతో భారత అధికారుల వినతి మేరకు కుల్లూను విడుదల చేసేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ అధికారులు సానుకూలంగా వ్యవహరించి జైలు నుంచి కుల్లూను వదిలిపెట్టినా భారత్ చేరుకోగానే పంజాబ్‌లో కరోనా క్వారంటైన్ తప్పలేదు. అక్టోబర్ 26న పాకిస్తాన్ నుంచి అమృత్‌సర్ చేరుకున్న కుల్లూను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అక్కడ 14 రోజులు ఉంచాక తిరిగి ఆయన స్వస్ధలం ఒడిశాకు పంపారు. స్ధానిక అధికారుల సాయంతో కుల్లూ ఇప్పుడు ఆయన స్వస్ధలం జంగతోలి చేరుకున్నారు.
అప్పటికే కుల్లూ తిరిగొస్తున్నాడన్న సమాచారం అందడంతో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో బతికున్న వారంతా ఒక్కచోటికి చేరుకున్నారు. కుల్లూకు ఘనస్వాగతం పలికారు. సుదీర్ఘ విరామం తర్వాత స్వస్ధలానికి చేరడంతో కుల్లూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు కుల్లూ. కొసమెరుపు ఏమంటే జరిగిన విషయాలు ఏవీ అతనికి గుర్తుకులేవు.