అంగారక గ్రహం నుంచి భూమికి రాతి నమూనాలు, తొలిసారిగా నాసా వినూత్న ప్రయోగం

అమెరికాలోని నాసా..అంగారక (అరుణ) గ్రహం నుంచి రాతి నమూనాలను భూమికి తెచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దీనికి మార్స్ శాంపిల్ రిటర్న్ అని పేరు పెట్టారు. ఈ నమూనాలను అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులు..

అంగారక గ్రహం నుంచి భూమికి రాతి నమూనాలు, తొలిసారిగా  నాసా వినూత్న ప్రయోగం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 14, 2020 | 9:56 PM

అమెరికాలోని నాసా..అంగారక (అరుణ) గ్రహం నుంచి రాతి నమూనాలను భూమికి తెచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దీనికి మార్స్ శాంపిల్ రిటర్న్ అని పేరు పెట్టారు. ఈ నమూనాలను అధ్యయనం చేసే శాస్త్రజ్ఞులు అరుణ గ్రహంపై జీవ రాశి ఉండేదా అన్న విషయమై పరిశోధనలు చేయనున్నారు. నాసా తన ఈ బృహత్ ప్రయత్నంలో భాగంగా యూరోపియన్ స్పేస్ ఏజన్సీతో అవగాహన కుదుర్చుకుంది. ఇందుకు అనువుగా ఎం ఎస్ ఆర్ ఇండిపెండెంట్ రివ్యూ బోర్డు పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. మరో గ్రహం నంచి రాతి నమూనాలను భూమికి  తెచ్చే ప్రయత్నం జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఇప్పటికే అంగారక గ్రహానికి సంబంధించి పలు పరిశోధనలు జరుగుతున్నాయి. చంద్ర గ్రహంపై నీటి జాడలను ఇటీవల కనుగొన్న విషయం విదితమే. అలాగే అంగారక గ్రహానికి సంబంధించి కూడా రీసెర్చ ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని యోచిస్తున్నారు.