AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా వింత గాధ వినుమా’ రివ్యూ : సిద్ధు మరోసారి ఆకట్టుకున్నాడా..మీరే చదవండి !

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ జంటగా ఆదిత్య మండ‌ల తెరకెక్కించిన చిత్రం `మా వింత గాధ వినుమా` సినిమా. చాలా సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం `ఆహా` వేదికగా ఇటీవల విడుదల అయింది.

'మా వింత గాధ వినుమా' రివ్యూ : సిద్ధు మరోసారి ఆకట్టుకున్నాడా..మీరే చదవండి !
Ram Naramaneni
|

Updated on: Nov 14, 2020 | 10:01 PM

Share

సినిమా :  `మా వింత గాధ వినుమా`

నటీనటులు : సిద్ధు జొన్నలగడ్డ, సీరత్‍ కపూర్‍, తనికెళ్ల భరణి, ప్రగతి, జయప్రకాష్‍, కమల్‍ కామరాజు, కల్పిక, రాజేశ్వరి నాయర్‍ తదితరులు

దర్శకత్వం : ఆదిత్య మండ‌ల

సంగీతం : శ్రీచరణ్ పాకాల

నిర్మాతలు :సంజయ్ రెడ్డి – అనిల్ పల్లాల- జి. సునీత- కీర్తి చిలుకూరి

విడుదల : ఆహా (ఓటీటీ)

ఇంట్రో : 

సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ జంటగా ఆదిత్య మండ‌ల తెరకెక్కించిన చిత్రం `మా వింత గాధ వినుమా` సినిమా. చాలా సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం `ఆహా` వేదికగా ఇటీవల విడుదల అయింది. ట్రైలర్‌తో మంచి బజ్  సంపాదించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ :

సిద్ధూ (సిద్ధు జోన్నలగడ్డ)కు లైఫ్ అంటే చాలా నిర్లక్ష్యం. అతడు కొన్నేళ్లుగా వినీత (సీరత్ కపూర్)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమెను ప్రేమించేలా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. చివరికి ఇంప్రెస్ అయ్యి వినీతా ఓకే చెబుతోంది. ఆ తరువాత కథానుగుణంగా సిద్ధుతో కలిసి వినీత తన సోదరుడి (కమల్ కామరాజు) ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం గోవాకు వెళ్తుంది. అక్కడ పరిస్థితులు అకస్మాత్తుగా మారతాయి. సిద్ధూ వినీత తాగిన మత్తులో పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి వీడియో విపరీతంగా సర్కులేట్ అవుతంది. దీంతో వీరి లవ్ స్టోరీలో మనస్పర్థలు వచ్చి విడిపోతారు. అసలు వారి మధ్య వచ్చిన సమస్యలు ఏంటి..వాటిని ఎలా పరిష్కరించుకున్నారు.  అసలు మళ్లీ కలిశారా అన్న అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సిద్ధు జొన్నలగడ్డ నటన

శ్రీచరణ్ పాకాల సంగీతం

వైవా హర్ష, ఫిష్ వెంకట్ కామెడీ

మైనస్ పాయింట్స్ :

కాన్ ఫ్లిక్ట్ లేని ప్రేమకథ

స్క్రీన్ ప్లే అందంగా మలచకపోవడం

మిస్సైయిన ఎమోషన్స్

సాంకేతిక వర్గం :

ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ కథ తీసుకున్నప్పటికీ దర్శకుడు దానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాడు. ఓవరాల్ గా ఆదిత్య మండ‌ల చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి.  సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత విషయానికి వస్తే.. రెండు పాటలు బాగున్నాయి… నేపధ్య సంగీతం సో..సోగా సాగుతోంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఈ చిత్రానికి నిర్మాణ విలువలు బాగున్నాయి.