Jaguar Land Rover: భారత రహదారులపై దూసుకెళ్లనున్న ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ కారు.. కేవలం 4.8 సెకండ్లలో 100 కి.మీ వేగం..

Jaguar Land Rover Electric Car Launch In India: పర్యావరణ సంరక్షణ, ఇంధన వినియోగం తగ్గించడంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న చర్చ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన పెరుగుతోంది...

Jaguar Land Rover: భారత రహదారులపై దూసుకెళ్లనున్న ల్యాండ్ రోవర్ ఎలక్ట్రిక్ కారు.. కేవలం 4.8 సెకండ్లలో 100 కి.మీ వేగం..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 08, 2021 | 4:22 PM

Jaguar Land Rover Electric Car Launch In India: పర్యావరణ సంరక్షణ, ఇంధన వినియోగం తగ్గించడంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న చర్చ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ వాహనతయారీ కంపెనీలు విద్యుత్ ఆధారిత వెహికిల్స్ తయారు చేస్తుండడం, ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటిస్తుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ జాగ్వర్ భారత్‌లో తన ఎలక్ట్రిక్ కారు ల్యాండ్ రోవర్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఐ-పేస్ కారును మార్చిన 9న భారత్‌లో విడుదల చేయనున్నారు. పూర్తిగా విద్యుత్‌తో నడిచే రెండో లగ్జరీ కారుగా ఈ ఐ-పేస్ మారనుంది. మరో ప్రముఖ కార్ల కంపెనీ మెర్సెడిస్ కంపెనీ తన ‘ఈక్యూసీ’ కారును 2020లో తీసుకొచ్చింది. జాగ్వర్ తీసుకొస్తున్న ఈ ఐ-పేస్ కారు ‘ఈక్యూసీ’కి గట్టిపోటినివ్వనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఐ-పేస్‌కు సంబంధించిన బుకింగ్స్ గతేడాది నవంబర్‌లోనే ప్రారంభమయ్యాయి. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారును 90 కె.డబ్ల్యూ,హెచ్ సామర్థ్యం ఉన్న లిథియం ఐయాన్ బ్యాటరీతో రూపొందించారు. ఈ కారు 294 కి.వాట్స్ వద్ద 696 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక కేవలం 4.8 సెకండ్లలలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు మరో ప్రత్యేకత. మరి భారత మార్కెట్లో ఈ లగ్జరీ కారు ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read: Petrol, Diesel Price (08-02-2021): సామాన్యుడికి భారంగా మారుతున్న పెట్రోల్‌, డీజిల్‌… దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధరలు ఇలా..