Petrol, Diesel Price (08-02-2021): సామాన్యుడికి భారంగా మారుతున్న పెట్రోల్‌, డీజిల్‌… దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధరలు ఇలా..

Today Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. గతంలో నిలకడగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత కొన్ని రోజులుగా...

Petrol, Diesel Price (08-02-2021): సామాన్యుడికి భారంగా మారుతున్న పెట్రోల్‌, డీజిల్‌… దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధరలు ఇలా..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 08, 2021 | 10:48 AM

Today Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. గతంలో నిలకడగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది. వాహనదారుల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా చమురు సంస్థలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ఇక ఫిబ్రవరి 8న దేశ వ్యాప్తంగా లీటర్, డీజిల్ ధరలను పరిశీలిస్తే…ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.86.95గా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.77.13కు చేరింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ ధర రూ.90.42, డీజిల్‌ రూ.84.14గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99గా నమోదైంది. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.83.33 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ.89.85 ఉండగా, డీజిల్ రూ.81.76గా ఉంది. అలాగే కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.30, డీజిల్ రూ.80.71 ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యుడి జేబుకు చిల్లులు పడేలా ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచేది లేదని చెప్పినా.. ప్రతి రోజు స్వల్పంగా పెరుగుతుతూనే ఉన్నాయి.

మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్‌) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.95 శాతం పెరుగుదలతో 59.56 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.51 శాతం పెరుగుదలతో 57.08 డాలర్లకు ఎగసింది. అయితే పెరుగుతున్న ముడిచమురు ధరలు భారతదేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఇప్పుడు కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

Also Read:

Gold Price Today(08-02-2021): స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. . హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..

Silver Price Today (08-02-2021): నిలకడగా వెండి ధరలు.. దేశ వ్యాప్తంగా ఏ నగరాల్లో ఎంత అంటే..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!