Silver Price Today (08-02-2021): నిలకడగా వెండి ధరలు.. దేశ వ్యాప్తంగా ఏ నగరాల్లో ఎంత అంటే..

Silver Price Today (08-02-2021): దేశీయంగా వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి సోమవారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 1న..

Silver Price Today (08-02-2021): నిలకడగా వెండి ధరలు.. దేశ వ్యాప్తంగా ఏ నగరాల్లో ఎంత అంటే..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 08, 2021 | 6:48 AM

Silver Price Today (08-02-2021): దేశీయంగా వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి సోమవారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ సందర్భంగా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనతో బంగారం, వెండి ధరలు వెనుకంజ వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ధరలు దిగి వస్తున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధర తగ్గుతుండగా, ఈ రోజు మాత్రం వెండి ధరలు నిలకడగా ఉంది.

ప్రస్తుత ఢిల్లీలో కిలో వెండి రూ.68,700 ఉండగా, హైదరాబాద్‌లో 73,400 ఉంది, కోల్‌కతాలో కిలో వెండి రూ.68,700 ఉండగా, ముంబైలో కిలో వెండి రూ.68,700, చెన్నైలో కిలో వెండి ధర రూ.73,400 ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

Also Read: Gold Price Today(08-02-2021): స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. . హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..