AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Today : దేశీయ మార్కెట్‌లో బుల్ జోరు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలు పైపైకి..

దేశీయ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది, 617 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేరుకుంది. 192 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 15,116 వద్ద ముగిసింది.

Share Market Today : దేశీయ మార్కెట్‌లో బుల్ జోరు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలు పైపైకి..
share market today
Sanjay Kasula
|

Updated on: Feb 08, 2021 | 6:18 PM

Share

Share Market Today : దేశీయ మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది, 617 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేరుకుంది. 192 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 15,116 వద్ద ముగిసింది. వారం ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి.

సోమవారం సెషన్​లో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్… 617 పాయింట్లు లాభపడ్డాయి. ఓ దశలో 51,523 పాయింట్లతో సరికొత్త జీవితకాల గరిష్ఠానికి చేరిన మార్కెట్ సూచీ.. చివరకు 51,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం భారీ లాభాల్లో దూసుకుపోయింది.

ట్రేడింగ్​లో 15,144 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 192 పాయింట్ల లాభంతో.. 15,116 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో మహీంద్ర అండ్ మహీంద్ర 7 శాతానికిపైగా వృద్ధి చెందింది. ఐటీసీ, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్ మినహా అన్ని షేర్లు లాభాల్లోనే పయనించాయి.

సెన్సెక్స్ 51,523.38 రికార్డును, ఇంట్రాడే ట్రేడ్‌లో నిఫ్టీ 15,159.90 ను తాకింది. దగ్గరగా, సెన్సెక్స్ 617 పాయింట్లు లేదా 1.22 శాతం పెరిగి 51,348.77 వద్ద ఉండగా, నిఫ్టీ 192 పాయింట్లు లేదా 1.28 శాతం పెరిగి 15,115.80 వద్ద ఉంది. విస్తృత మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచికలు కూడా 1.5 శాతం పెరిగాయి. ఆటో, మెటల్, టెలికాంతోపాటు రియాల్టీ సూచికల నేతృత్వంలో చాలా రంగాల సూచికలు లాభాలను ముటగట్టుకున్నాయి.

సానుకూల అంశాలు..

అమెరికా ఉద్దీపన, వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ ఆశలు సెంటిమెంట్‌ను పెంచడంతో ఆసియా మార్కెట్లు ఆరోగ్యకరమైన లాభాలతో కొనసాగాయి. దీనికి తోడు కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లే.., ఈ నెలలో అమెరికా సెనెట్లు 1.9 ట్రిలియన్ డాలర్ల COVID-19 సహాయ ప్యాకేజీని ఆమోదిస్తారని ఆశతో  ఆసియా షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. ఇలాంటి విదేశీ మార్కెట్లు సానుకూల అంశాలు కూడా దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.

లాభపడిన…

సెన్సెక్స్ పెరుగుదలకు ఇన్ఫోసిస్, టిసిఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా & మహీంద్రాతో సహా బ్యాంకింగ్ మరియు ఆటో స్టాక్స్ టాప్ గేర్‌లో కొనసాగాయి. ఈ రంగాలకు సహాయపడే చర్యలను బడ్జెట్ ప్రకటించిన తరువాత బ్యాంకింగ్ మరియు ఆటో స్టాక్స్ లాభపడుతున్నాయి.