‘ఎస్‌బీఐ రూపే జన్‌ధన్ కార్డు’ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి.. రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ పొందండి..

SBI Rupay Jandhan Card: మీరు కొత్తగా జన్‌ధన్ ఖాతా తెరవాలని అనుకుంటున్నారా.? అయితే కాస్త ఆగండి.! అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్...

  • Ravi Kiran
  • Publish Date - 6:34 pm, Mon, 8 February 21
'ఎస్‌బీఐ రూపే జన్‌ధన్ కార్డు' కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి.. రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ పొందండి..

SBI Rupay Jandhan Card: మీరు కొత్తగా జన్‌ధన్ ఖాతా తెరవాలని అనుకుంటున్నారా.? అయితే కాస్త ఆగండి.! అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జన్‌ధన్ ఖాతా తెరిస్తే రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. దాని కోసం మీరు ఎస్‌బీఐ రూపే జన్‌ధన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌బీఐ ట్వీట్ ద్వారా ప్రజలకు అందించింది. కాగా, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన-పీఎంజేడీవై కింద సున్నా బ్యాలెన్స్‌పై జన్‌ధన్ ఖాతాను తెరుచుకోవచ్చన్న సంగతి తెలిసిందే. ఈ అకౌంట్ల ద్వారా ఖాతాదారులకు అనేక సౌకర్యాలు లభిస్తాయి.

జన్‌ధన్ అకౌంట్‌దారులకు ఎస్బీఐ రూపే జన్‌ధన్ కార్డులు ఇస్తారన్న విషయం విదితమే. వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. దీనికోసం మీరు 90 రోజులకు ఓసారి కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీకు రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది.

జన్‌ధన్ ఖాతా తెరవడానికి అవసరమైన డాక్యుమెంట్స్:

  • జన్‌ధన్ ఖాతా తెరిచేందుకు మీరు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సమర్పించాలి.
  • ఈ ఖాతా తెరవడానికి మీరు ఎటువంటి రుసుము లేదా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
  •  10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ ఖాతాను తెరవగలరు.

10 వేల రూపాయలు ఉపసంహరించుకునే సౌకర్యం:

జన్‌ధన్ ఖాతా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు జన్‌ధన్ ఖాతా ఉంటే, ఓవర్‌ డ్రాఫ్ట్ ద్వారా మీ ఖాతా నుండి రూ .10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు.