Tesla Investment on Bitcoin : బిట్ కాయిన్‌లోకి పెట్టుబడుల వరద.. భారీగా ఇన్వెస్ట్ చేసిన ప్రపంచ కుబేరుడు
Bitcoin Price: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌లోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా ప్రపంచ కుబేరుడు, విద్యుత్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధినేత ఎలాన్ మస్క్ బిట్‌కాయిన్‌లో
Tesla Investment on Bitcoin : ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌లోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. తాజాగా ప్రపంచ కుబేరుడు, విద్యుత్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ బిట్‌కాయిన్‌లో భారీగా పెట్టబడులు పెట్టాడు. బిట్కాయిన్లలో దాదాపు 1.5 బిలియన్ డాలర్లు (దాదాపు 10,930 కోట్లు) కొనుగోలు చేసింది. త్వరలోనే తమ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు డిజిటల్ చెల్లింపులను బిట్ కాయిన్ల రూపంలోనూ స్వీకరించనుందీ ‘టెస్లా’ సంస్థ.
డిజిటల్ కరెన్సీ సహా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తమ పెట్టుబడులు పెరుగుతాయని.. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్‌కు టెస్లా తెలిపింది. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ విలువ 14 శాతం పెరిగి, గరిష్ఠ స్థాయికి చేరింది. టెస్లా షేర్ల విలువ కూడా పెరిగింది. గత నెలలో నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికలో టెస్లా వద్ద నగదు, నగదు సమానమైన 19.4 బిలియన్ డాలర్లు ఉన్నాయని ప్రకటించింది.
దూకుడు పెంచిన బిట్ కాయిన్…
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌లో 150 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్టు టెస్లా ప్రకటించడంతో బిట్ కాయిన్ విలువ ఒక్కసారిగా 14 శాతం పెరిగి చారిత్రక రికార్డు 44,000 డాలర్లను నమోదు చేసింది. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ టాగ్‌ను తన ట్విట్టర్ ప్రొఫైల్ పేజీలో పెట్టిన పది రోజుల తర్వాత ఈ-కార్ల దిగ్గజం ఈ భారీ పెట్టుబడి ప్రకటన చేసింది. బిట్ కాయిన్‌లో పెట్టుబడి పెట్టడమే కాకుండా తమ కార్లు, ఇతర ఉత్పత్తుల కొనుగోలుదారులు బిట్ కాయిన్‌లో చెల్లించేందుకు త్వరలోనే అనుమతించనున్నట్టు టెస్లా తెలిపింది. తమ కంపెనీ విస్తృత ఇన్వె్‌స్టమెంట్ విధానానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టెస్లా తెలియచేసింది. దీర్ఘకాలంలో తాము డిజిటల్ ఆస్తులు కూడా పెంచుకుంటామని పేర్కొంది. 2020లో 300 శాతం పెరిగిన బిట్ కాయిన్ విలువ ఈ ఏడాది ఇప్పటికే 50 శాతం పెరగటం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
ఏపీ పంచాయతీ పోరులో ఏకగ్రీవాలకు లైన్ క్లియర్.. సర్పంచ్‌లకు డిక్లరేషన్ ఇవ్వాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ‘తొలి’ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..